టీడీపీ జల విహారం.. అభిమానం చాటిన మత్స్యకారులు
ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం.. రా ష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది.;
ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం.. రా ష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఎక్కడికక్కడ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి కార్యక ర్తలు, నాయకులు నివాళులర్పించారు. అయితే.. అందరికన్నా భిన్నంగా గుంటూరు జిల్లాకు చెందిన మత్స్యకా రులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కృష్ణా నదిలో వినూత్నం గా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగం గా 10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో నదిలో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణా నదిలో తెలుగుదేశం పార్టీ జెండాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బోటింగ్ సొసైటీ ఆధ్వ ర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుంచి ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మర బోట్లతో ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా నదిపై ఈ ర్యాలీ నిర్వహించారు.
మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ నిర్వహించారు. గతంలోనూ మత్స్యకారులు ఇలానే తమ అభిమానం చాటుకున్నారు. కాగా.. కూట మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మత్స్యకార సాయం పేరుతో అందిస్తున్న ఆర్థిక సాయంతోపాటు.. వేట విరామ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు వంటివి మత్స్యకారులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. ఆది నుంచి కూడా మత్స్యకారులు టీడీపీ పట్ల తమ అభిమానం చాటుకుంటున్నారు.