వైసీపీలో రీ జాయినింగ్స్ కమిటీ ?
జనసేన ఈ మధ్యనే జాయినింగ్ కమిటీని ఒక దానిని ఏర్పాటు చేసింది. నిజానికి ఇలాంటి కమిటి ఒకటి ఉండాలని కూడా ఎవరికీ తోచని నేపధ్యంలో జనసేన ఈ ప్రయోగం చేసింది.
జనసేన ఈ మధ్యనే జాయినింగ్ కమిటీని ఒక దానిని ఏర్పాటు చేసింది. నిజానికి ఇలాంటి కమిటి ఒకటి ఉండాలని కూడా ఎవరికీ తోచని నేపధ్యంలో జనసేన ఈ ప్రయోగం చేసింది. నిజానికి ఎవరి పార్టీ వారి ఇష్టం. ఏ రకమైన కమిటీలు అయినా వేసుకోవచ్చు. అందువల్ల జనసేన తమ పార్టీని సంస్థాగతంగా బాగా పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. మరి జాయినింగ్స్ కమిటీ పని ప్రరంభించిందా అది ఎంతవరకూ వచ్చింది అన్నది అయితే ఇప్పటిదాకా తెలియలేదు. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాలో సీనియర్ నేతలతో వైసీపీ నుంచి వచ్చిన వారితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ద్వారా మాజీ వైసీపీ నేతలను ఆకట్టుకోవాలని వారిలో మంచి వారు అంటే ఆర్థికంగా బలవంతులకు పెద్ద పీట వేయాలని కూడా జనసేన సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అయితే కదలికలు రాజకీయంగా మొదలయ్యాయని అంటున్నారు.
వైసీపీ మాజీల సంగతేంటి :
ఈ క్రమంలో వైసీపీని వీడి ఏ పార్టీలో చేరకుండా ఉంటున్న మాజీల సంగతి ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కూటమి పార్టీలలో చేరి అక్కడ తమకు తగిన ప్రాధాన్యత లేని వారి విషయం ఏమిటి అన్నది కూడా చర్చిస్తున్నారు. వైసీపీ అయితే రెండేళ్ల పాటు ఒక మాదిరిగా ఆందోళనలు చేసింది. ఇక జూన్ 12న కూటమి రెండేళ్ళ పాలనకు వెన్ను పోటు అన్న ఆందోళన తరువాత వైసీపీ జోరు పెంచింది. ప్రతీ ఇష్యూని తీసుకుని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. ఏదో విధంగా కూటమిని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ వైపు చూడాలని ఆలోచిస్తున్న వారిలో కూడా కదలిక మొదలైంది అని అంటున్నారు.
ఆయన ఫ్యాన్ వైపుగా :
ఇక వైసీపీలో చేరేందుకు మాజీ నేతలు కొందరు చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. భీమవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధి శ్రీనివాస్ 2019లో పవన్ కళ్యాణ్ నే ఓడించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అనుకుంటే దక్కలేదు, దాంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. 2024 ఎన్నికల తరువాత తన వ్యాపారాల మీద కూడా ఒత్తిళ్ళు ఉండడంతో వైసీపీకి దూరం జరిగారు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీ లేదా టీడీపీలో చేరుతారు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ఏంటి అంటే భీమవరం గ్రంధి శ్రీనివాస్ వైసీపీలోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తారని. దాని మీదనే ఇపుడు గోదావరి జిల్లాలలో ప్రచారం మొదలైంది.
ఓకే అంటే రెడీ అంటూ :
ఇక ఉత్తరాంధ్రలోని మాజీ మంత్రితో పాటు మరి కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అలాగే గుంటూరు జిల్లా ఇక మరి కొన్ని జిల్లాలలో కూడా వైసీపీని వీడిన వారు ఇతర పార్టీలలో చేరిన వారు కూడ ఇపుడు వైసీపీ వైపు రావాలని అనుకుంటున్నారు. అలాగే గతంలో వైసీపీలో కీలక పదవులు చేపట్టిన గోదావరి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కూడా ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అయితే వీరి చేరికకు వైసీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఒక్కొక్కరిని కాకుండా అందరికీ ఒకే విధంగా పచ్చ జెండా ఊపి తీసుకోవాలా లేక అందరినీ దూరం పెట్టేయాలా అన్నది కూడా వైసీపీ హైకమాండ్ ఇంకా డెసిషన్ తీసుకోలేదని అంటున్నారు.
వైసీపీ కూడా కమిటీ :
ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తమ పార్టీలో రీజాయింగ్స్ కి మాజీ వైసీపీ నేతల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. వైసీపీ వైపు ఎంత మంది చూస్తున్నారు, అలా వచ్చే వారు మళ్లీ హ్యాపీగా పార్టీలో కొనసాగుతారా లేదా, యాక్టివ్ గా వారు పాల్గొంటారా లేదా అన్నది పార్టీ కనుక కమిటీ ఏర్పాటు చేస్తే పరిశీలిస్తుందని అంటున్నారు. అలాగే మాజీలు వస్తే కనుక ప్రస్తుతం ఉన్న వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇలా మళ్ళీ తిరిగి వచ్చే వారితో పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా లేదా అన్నది కూడా వైసీపీ ఆలోచిస్తోంది. మరి వైసీపీ కూడా రీజాయింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుందా లేక అధినాయకత్వం స్థాయిలోనే నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.