నిమ్మగడ్డ లేఖ పై కీలక పరిణామం..సీఐడి చేతిలో రిపోర్ట్!

Update: 2020-05-05 13:30 GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ లేఖ విషయంలో సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్‌ ఈసీ ఆఫీస్లో తయారు కాలేదని రిపోర్ట్‌ లో తేలినట్లు సమాచారం. లాప్ ‌ట్యాప్, - డెస్క్ ‌టాప్‌ లను పరిశీలించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారన్న సీఐడీ చెబుతోంది. దీనికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తి చెప్పినవన్నీ అబద్దాలు అని సీఐడీ చీఫ్ సునీల్ చెప్పారు. 18వ తేదీ ఉదయం పెన్ ‌డ్రైవ్ ‌లో లేఖ వచ్చిందని.. లెటర్ ముందే తయారు చేసి తీసుకొచ్చారన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా నివేదిక ఉందని.. ఫైల్ కార్యాలయంలో తయారైందని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తేలుస్తామని.. రహస్య లేఖ అయితే బయటకెలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ కుట్ర కోణంలో లేఖ అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నాం అన్నారు. మాజీ ఎస్ ‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. సీఐడీ కూడా రంగంలోకి దిగి లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తిని ప్రశ్నించింది. అలాగే రమేష్ ‌కుమార్ ‌ను కూడా విచారించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం ఆసక్తికరంగా మారింది. సీఐడీ ఈ అంశంపై ఎలా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News