రెండేళ్ల వరకు కరోనా ఆ దేశం సరిహద్దు కూడా దాటలేకపోయింది..!

Update: 2021-12-06 01:30 GMT
కరోనా వైరస్​... ప్రపంచం మొత్తానికి రెండేళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే మొదటి దశ, రెండో దశ, మూడో దశ అంటూ పేర్లు పెట్టుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. మనం దేశంలో కూడా ఇప్పటి వరకు రెండు దశలను చూశాం. కానీ ఇంకా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించారు. వైరస్​ దాటికి  అనేక దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. చివరకు వ్యాక్సిన్​ లు అందుబాటులోకి రావడంతో ప్రపంచం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

 పెద్ద ఎత్తున టీకా తీసుకోవడం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి దేశాలు. ఇంత చేస్తే కానీ వివిధ దేశాల్లో వైరస్​ కు సంబంధించిన కేసులు అదుపులోకి రాలేదు. మరో అడుగు ముందుకు వేస్తే కరోనా వివిధ విధాలుగా రూపాంతరం చెంది.. దాని వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. కానీ ఓ దేశంలోకి మాత్రం రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అంట. ఇంతకీ అలాంటి దేశం కూడా ఒకటి ఉందా అని ఆలోచిస్తున్నారా? ఉంది. అదే కుక్​ ఐలాండ్స్​.
Read more!

చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్​ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించినా.. నిన్న మొన్నటి వరకు ఈ కుక్​ ఐలాండ్స్​ దరిదాపులకు కూడా రాలేదు అంటా.  ఇది సౌత్​ పసిఫిక్​ లో ఉంటుంది. ఇక్కడ కొవిడ్ వ్యాప్తి చెందక పోవడానికి ఓ కారణం ఉంది. ఈ దేశం ప్రపంచానికి చాలా దూరంగా ఉండడంమే. దీంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. దీంతో వైరస్​ కేసులు ఈ నెల ముందు వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

అయితే ఇటీవలే ఈ చిన్న దేశంలో కరోనా తొలి కేసు నమోదు అయ్యింది. అది కూడా ఓ చిన్న బాలుడిలో. ఆ అబ్బాయికి 10ఏళ్ల వయసు ఉంటుంది. ఆ కుర్రాడు ఈ నెల రెండో తేదీన న్యూజిలాండ్​ నుంచి ఆ దేశానికి వచ్చినట్లు ఆ దేశ ప్రధాని మార్క్​ బ్రౌన్​ తెలిపారు. ఆ బాలుడితో పాటు అతని కుటుంబం కూడా ఆ  దేశానికి వచ్చినట్లు  పేర్కొన్నారు. వారికి కూడా పరీక్షలు జరిపినట్లు తెలిపారు. అయితే వారికి మాత్రం నెగిటివ్​ వచ్చినట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్​ను తీసుకున్న వారికి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

మొత్తంగా ఈ దీవిలో సుమారు 17 వేల మంది ఉంటారు. అయితే అందులో ఉండే వారిలో  96 శాతం మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్​ పూర్తి అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అక్కడి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News