ఉద్యోగాలున్నాయి..వర్కర్స్ ను ఇవ్వండి: కంపెనీలు

Update: 2020-05-16 10:57 GMT
భారతదేశంలోని టాప్ ఆహార ఉత్పత్తుల కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశాయి.దేశంలో ఆహార కొరత రాకుండా మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని.. తద్వారా మరింత ఉత్పత్తి చేస్తామని.. ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని కేంద్రానికి దేశంలోనే టాప్ కంపెనీలు అయిన పెప్సీ, పార్లే, ఐటీసీ, మోండెలేజ్, హిందుస్తాన్ యునీ లీవర్, నెస్లే, బ్రిటానియా కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించాయి.

లాక్ డౌన్ తో దేశంలో తగ్గిన ఆహార పదార్థాల లభ్యతను పెంపొందించేందుకు సామాజిక దూరం సహా వివిధ నిబంధనలు పాటిస్తూనే ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సంస్థలు కోరాయి. సీఐఐ కూడా ఈ మేరకు లేఖ రాసింది. ఉద్యోగుల సంఖ్య పరిమితిని ఎత్తివేయాలని కోరాయి.

ఇక పరిశ్రమల చట్టంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని.. పనివేళలను 8 నుంచి 12 గంటలకు పెంచేలా అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాయి. పెరిగిన పనివేళలకు తగినట్టుగా చెల్లింపులు, వేతనాలు కూడా కార్మికులకు చేస్తామని తెలిపాయి. కార్మికుల సమ్మతితోనే ఎక్స్ ట్రా పనులు అప్పగిస్తామని హామీ ఇచ్చాయి. ఈ నిర్ణయాల వల్ల కస్టమర్ల డిమాండ్ కు తగినట్టుగా ఉత్పత్తులను అందివ్వగలమని కంపెనీలు కోరాయి.

ఈ విషయంలో స్థానిక రాష్ట్రాలకు 12 గంటల పనికి కొన్ని ఓకే చెప్తున్నాయని.. కొన్ని నో అంటున్నాయని.. పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని.. దేశవ్యాప్తంగా కేంద్రం దీనికి సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.
Tags:    

Similar News