15 ఏళ్లు పూర్తి చేసుకున్న T20
క్రికెట్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోన్న గేమ్. ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ ని ఒక మతంలా భావిస్తారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా ప్రతి గల్లిలోని పిల్లలు బ్యాట్ పట్టి కనిపిస్తుంటారు. ఇక ఇండియన్ టీం తరపున గ్రౌండ్ లో ఆడాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు. కానీ , అందరికి ఆ అవకాశం రాదు. ఇకపోతే ఒకప్పటి క్రికెట్ వేరు ..ప్రస్తుత క్రికెట్ వేరు. ఒకప్పుడు సంప్రాదయానికి విలువనిచ్చే టెస్ట్ క్రికెట్ అంటే ఎనలేని అభిమానం ఉండేది. కానీ , ప్రస్తుత ఈ ఆధునిక యుగంలో ఐదు రోజుల పటు మ్యాచ్ చూసే సమయం కానీ , ఓపిక కానీ పెద్దగా ఎవరికీ లేవు. దానికి తగ్గట్టే క్రికెట్ కూడా రూపాంతరం చెందుతూ 50 -50 , T20 మ్యాచ్లు వచ్చేసాయి.
వన్డేలు వచ్చినప్పుడు క్రికెట్ లో అంతగా మార్పులు రాలేదు కానీ, t20 మ్యాచ్లు వచ్చిన తరువాత క్రికెట్ స్వరూపమే మారిపోయింది. 20 ఓవర్ల మ్యాచ్ అయితే కేవలం మూడు నుండి నాలుగు గంటల్లోనే ఫలితం కూడా తేలి పోతుంది. అలాగే ధనాధన్ షార్ట్స్ తో క్రికెటర్స్ కి అభిమానులని అలరిస్తారు. దీనితో t20 లకి బాగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడ్డారు. క్రికెట్ గమనాన్నే మార్చిన t20 మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి నేటికీ సరిగ్గా ..15 ఏళ్లు పూర్తి అవుతుంది. 2005 , ఫ్రిబవరి 17 న ఆస్ట్రేలియా వేదికగా , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మధ్య మొదటి అంతర్జాతీయ t20 మ్యాచ్ జరిగింది.
ఆ మొదటి t20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్ల లో 214 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికి పాంటింగ్ ఆ అమ్యాచ్ లో 98 పరుగులు సాధించాడు. ఆ తరువాత 215 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన కివీస్ ..పోరాడి 170 పరుగుల వద్ద అల్ అవుట్ అయ్యింది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ మైఖేల్ కాస్ప్రోవిజ్ నాలుగు వికెట్లు తీసాడు. ఆ మ్యాచ్ మొత్తం క్రికెట్ గతినే మార్చేసింది. ఆ తరువాత ఎక్కువగా t20 లు చూడటానికే ఇష్టపడుతున్నారు. అలాగే ఎంతోమంది ఈ t20 మ్యాచ్ లలో తమ ప్రతిభ నిరూపించుకొని ఇండియన్ టీం లో చోటుసంపాదించుకున్నారు. ఆ తరువాత పలు దేశాలు ఈ t20 లీగ్స్ ని ప్రారంభించాయి. ముఖ్యంగా బీసీసీఐ చేపట్టే ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.