ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హైదరాబాదీ..

Update: 2022-01-06 13:30 GMT
ఒకప్పుడు తరతరాలు కూడా ఒకే ఊరిలో నివసించేవారు. తాతలు, ముత్తాతలు సంపాదించిన పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. వారు సంపాదించిన స్థలంలో ఇంటిని నిర్మించుకునేవారు. అయితే మారిన సాంకేతికత, అభివృద్ధి దృష్ట్యా పుట్టిపెరిగిన గడ్డమీద కాకుండా వేరే ప్రాంతాల్లో దేశాల్లో నివసిస్తున్నారు.

అయితే వారికి ఏదో ఒకసమయంలో తాత, ముత్తాతల ఊరికి రావాలనుకుంటారు. పూర్వీకుల ఇళ్లలో ఉండాలనుకుంటారు. ఆ మాతృభూమి మీద ఎనలేని మమకారం ఉంటుంది. వారు విదేశాల్లో పౌరసత్వం పొందడం వల్ల ఇక్కడికి రావడానికి నానా చిక్కులు వచ్చేవి. అయితే ఎంతోమంది ఇక్కడ కూడా సిటిజన్ షిప్ కావాలని విజ్ఞప్తులు చేసేవారు. కానీ అవి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉండేవి.

ఎన్ఆర్ఐల విజ్ఞప్తుల మేరకు భారత ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను 2005లో ప్రవేశపెట్టింది. ఈ కార్డును అప్పటిప్రధాని మన్మోహన్ సింగ్ తొలి వ్యక్తికి అందజేశారు. ఇక అప్పటివరకు ఉన్న పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ కార్డును ఇందులో విలీనం చేస్తున్నట్లు 2014లో ప్రకటించింది. ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

భాగ్యనగరానికి చెందిన ఇఫ్తేఖాన్ షరీప్ అందుకున్నారు. ఆయన అమెరికాలోని చికాగోలో నివాసం ఉంటున్నారు. శంషాబాద్ కు చెందిన ఈయన చిన్నతనంలోనే అగ్రరాజ్యానికి వెళ్లిన ఆయన... వ్యాపారవేత్తగా ఎదిగారు. అంతేకాకుండా సామాజిక సేవలోనూ ముందున్నారు. ఆయన సేవలను గుర్తించి తొలి కార్డు షరీఫ్ కు ఇచ్చారు.

ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా కార్డుతో ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ కార్డు ఉంటే మాతృదేశానికి ఎన్నిసార్లైనా రావడానికి వీసా ఉంటుంది. వారి కుటుంబసభ్యులు ఇక్కడ నివసించడానికి అనుమతులు ఉంటాయి. ఆర్థిక, విద్యా విధానాలు సమానంగా ఉంటాయి. పని చేసుకునే హక్కు కూడా ఉంది.

అయితే భూములు, పొలాలు వంటి ఆస్తులను మాత్రం కొనడానికి నిషేధం విధించింది. అంతేకాకుండా ఈ కార్డుతో భారతీయ పౌరులుగా హోదా ఉండదు. ఓటు హక్కుకు అనర్హులు. కేవలం నివసిస్తూ... పనిచేసుకునే హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ఓఐసీ కార్డు నిబంధనలో కొన్ని మార్పులు 2021 ఏప్రిల్ లో తీసుకువచ్చారు.

ఈ కార్డును పొందాలంటే మన పూర్వీకుల వివరాలను కచ్చితంగా సమర్పించాలి. వారి వారసులుగా నిరూపించుకోవాలి. అంతేకాకుండా విదేశీ మిలటరీలో పనిచేస్తే ఐఓసీ పొందే హక్కు ఉండదు. పక్కాగా నిరూపణ అయ్యాకే ఈ కార్డు లభిస్తుంది. అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్ వారికి మాత్రం ఇది ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది.


Tags:    

Similar News