ఫార్మసి విధ్యార్దిని ఆత్మహత్యకి పోలీసులే కారణం.. హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు !
హైదరాబాద్ ఘట్ కేసర్ కి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటీషన్ దాఖలు చేశారు. తనపై అఘాయిత్యం జరిగిందని పోలీసులు ముందుకు వస్తే, ముద్దాయిలను అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు మరో రెండు తరువాత కిడ్నాప్ కానీ రేప్ కానీ జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్నారని పిటీషన్ లో పొందుపరిచారు. కోర్ట్ చెప్పాల్సిన జడ్జిమెంట్ పోలీసులే చెప్పారంటూ పిటిషన్ లో అడ్వకేట్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
కిడ్నాప్ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్ మీట్ లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని హెచ్ ఆర్సీని అరుణ్‌కుమార్ కోరారు. రాచకొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ ఆర్సీని ఆశ్రయించామని చెప్పారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు కేసు విషయాలని చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్ లు వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఇప్పుడు ఎవరు బాధ్యులని, ఇలా వ్యవహరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే .. కిడ్నాప్ డ్రామాతో నగరంలో సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఆ తర్వాత ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.