పార్లమెంట్ లో ఇక ‘సాగుచట్టాల’పై ప్రతిపక్షాల పోరు
దేశ రాజధాని వేదికగా రెండు నెలలుగా రైతులు ఆందోళన చేసినా.. ఇటీవల ట్రాక్టర్లతో తీవ్ర హింసకు పాల్పడినా కూడా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వంపై పోరాటానికి దేశంలోని 16 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక పార్లమెంట్ లో పోరాడాలని డిసైడ్ అయ్యాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఈ మేరకు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామన్న పార్టీల్లో.. కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ తదితర పార్టీలున్నాయి.కొత్త వ్యవసాయ చట్టాలతో వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని.. ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించదని.. తద్వారా ప్రజాపంపిణీ పెను ప్రభావానికి గురవుతుందని విపక్ష నేతలు అన్నారు.