మూడు కాదు నాయనా.. ఐదో వేవ్ కూడా ఉంటుందట..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి తాజాగా షాకింగ్ నిజాన్ని వెల్లడించారు ప్రముఖ క్లినికల్ సైంటిస్టు.. వైరాలజిస్టు గగన్ దీప్ కాంగ్. ఇప్పటికే ఒకటి.. రెండు వేవ్ లను చేసిన వైనం తెలిసిందే. ఇప్పుడు కొన్ని దేశాల్లో మూడో వేవ్ మొదలైంది. ఇలాంటివేళ.. అసలు ఎన్ని వేవ్ లు ఉంటాయన్నది ప్రశ్నగా మారింది. ఇదే ప్రశ్నను ఆమెను సంధిస్తే దిమ్మ తిరిగే వాస్తవాన్ని వెల్లడించారు.
ఇప్పటికే మూడో వేవ్ మొదలైందని అనుకుంటున్నారు కదా. అంటే.. తాను అలా అనుకోవటం లేదని చెప్పారు. స్థానిక పరిస్థితులు.. పరిణామాల్ని అనుసరించి ఒక్కో చోటు కేసులు పెరుగుతాయని.. కొన్ని చోట్ల నాలుగు.. ఐదో వేవ్ లు కూడా వచ్చే వీలుందని చెబుతున్నారు. కొత్త వేరియంట్ పుడితే పరిస్థితి వేరుగా ఉంటుందని.. ఇప్పటికైతే దేశంలో కొత్తగా ప్రమాకర మ్యూటెంట్లు.. వేరియంట్లు వచ్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్న ఆమె.. ఇప్పుడున్న సానుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయాలన్న ఆమె.. వైరస్ మూలాన్ని మాలిక్యులర్ సర్వైలెన్స్ ద్వారా రోగ కారక కొత్త సూక్ష్మజీవుల్ని గుర్తించి అరికట్టాలన్నారు. వైరస్ ను సమర్థంగా నియంత్రిస్తే.. కొత్త వేరియంట్లు.. వచ్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇప్పుడున్న సానుకూల పరిస్థితిని ఉపయోగించుకొని వైరస్ వ్యాప్తిని దేశ వ్యాప్తంగా పూర్తిగా కట్టడి చేయాలని కోరుతున్నారు.
వైరస్ ను సమర్థంగా నియంత్రిస్తే.. కొత్త వేరియంట్లకు.. స్టెయిన్లకు అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి ఆమె వివరంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ఎక్కడ ఉంది? ఏ విధంగా ఉందన్న విషయాలతో పాటు.. ఏయే ప్రాంతాల్లో కేసుల తీరు ఎలా ఉన్నాయన్న విషయాన్ని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతంచేసి.. కిందిస్థాయి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చూడాలని కోరుతున్నారు.
ప్రస్తుతం దేశంలో మూడో వేవ్ఉందని తాను అనుకోవటం లేదన్నారు. రెండో వేవ్ దాదాపుగా కనుమరుగైనట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. అన్ని కార్యకలాపాలు సాగుతున్నా.. రోజుకు 30 - 40 వేల లోపే కొత్త కేసులు నమోదు కావటం చూస్తే.. ఇదో సానుకూల అంశంగా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఓవైపు టీకాల కార్యక్రమాన్ని.. మరోవైపు పరీక్షల సంఖ్య ను పెంచాల్సి ఉందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పుంజుకొని స్వల్ప లక్షణాలతో కరోనా కేసులు వచ్చినా.. పెద్ద సమస్య కాబోదన్నారు. తీవ్రమైన కేసులు.. మరణాలుచోటు చేసుకుంటనే తిప్పలు కానీ.. లేని పక్షంలోఅదో పెద్ద సమస్య కాదంటున్నారు. మొత్తంగా మహమ్మారి మూడో వేవ్ తో పూర్తి కాదని.. మరో రెండు.. మూడువేవ్ లు ఉన్నాయన్న మాట వణుకుపుట్టేలా చేస్తుందని చెప్పక తప్పదు.