‘దివీస్ ఫార్మా’ వద్ద ఆందోళనలు.. దూసుకెళ్లి.. సామాగ్రికి నిప్పు
ప్రశాంత వాతావరణంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలో దివీస అలజడి అంతకంతకూ పెరగటమే కాదు.. తాజాగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాణంలో ఉన్న సంస్థ ప్రాంగణంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు అక్కడి జేసీబీలతో సహా వాహనాల్ని ధ్వంసం చేయటమే కాదు.. సామాగ్రికి నిప్పు పెట్టిన అసాధరణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకిలా జరిగింది? అసలేమైంది? అన్న విషయాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా వలసలపాక వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమను నిర్మిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతం వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై గడిచిన కొద్ది రోజులుగా రగులుతోంది. పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల రెండు నుంచి వామపక్ష నేతలు.. దివీస్ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పరిశ్రమ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఊహించని పరిణామాలు అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. కొందరు నిరసనకారులు ఒక్కసారిగా నినాదాలు చేసుకుంటూ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. పరిశ్రమ నిర్మాణంలో వెళ్లిన వారు అక్కడి జేసీబీలు.. వాహనాల్ని ధ్వంసం చేశారు. జెనరేటర్లతో పాటు షెడ్లలోని సామాగ్రికి నిప్పు పెట్టారు. కంచె.. గోడను ధ్వంసం చేశారు.
ఈ సమాచారం అందుకున్న ఫైరింజన్ ఘటనా స్థలానికి రాగా.. లోపలకు పోనివ్వకుండా గంట పాటు అడ్డుకున్నారు. పోలీసులు ప్రత్యేక బలగాలతో దివీస్ ప్రాంగణలోకి చేరుకొని.. యాభై మంది నిరసనకారుల్ని అదుపులోకి తీసుకుున్నారు. మరో 350 మంది బయట ఉండిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టాలని మరోసారి పరిశ్రమ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు.. నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిణామాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుతో తాము తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళన అక్కడి స్థానికులు చేస్తున్నారు. ఈ పరిణామం సంచలనంగా మారింది.