రైతులదే కీలక పాత్ర.. ఇదీ మోడీ మనసులో మాట..
ప్రతీ ఆదివారం తన మనసులోని మాటను ప్రజలతో ‘మన్ కీ బాత్’ పేరుతో పంచుకునే ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం కూడా అదే చేశాడు. ఈ ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ఈ మేరకు ప్రసంగించారు.
ఈనెల 28న షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. అనంతరం ‘ఆత్మ నిర్భర భారత్’లో రైతులదే కీలక పాత్ర అని తెలిపారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ కమిటీలకు తెచ్చి అమ్ముకోవడం ద్వారా రైతుల కొన్ని రాష్ట్రాల్లో లాభాలు అర్జిస్తారని తెలిపారు.
కరోనా సమయంలో వ్యవసాయ రంగం సత్తా చాటిందని.. స్వావలంబన భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు.
కొత్త బిల్లులతో రైతులకు నష్టం అని ప్రచారం చేశారని.. కానీ కనీస మద్దతు ధర రైతులకు అందుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కనుక సరిగ్గా పాలించి ఉంటే కొన్ని సంవత్సరాల కిందటే భారత్ స్వావలంబన సాధించేదని మోడీ అన్నారు.