బాబును సాగనంపడానికే సచివాలయ తరలింపు

Update: 2015-08-29 17:40 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సచివాలయం నుంచి సాగనంపడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ తరలింపు పాట పాడారా? అంతకు మించి దానిని తరలించడానికి ఆయనకు నిజంగా ఉద్దేశం లేదా? సచివాలయాన్ని ఖాళీ చేసేస్తామని అంటే ఏపీ ప్రభుత్వం నవ్యాంధ్రకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా? అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ఔను అనే జవాబిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం.. అందులో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాన్ని రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సచివాలయం, ఏపీ సచివాలయం కూడా ఇక్కడే ఉంటున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ సచివాలయ తరలింపు ప్రకటన చేశారు. అయితే దీనిపై అప్పట్టో గగ్గోలు రేగింది. చాతీ ఆస్పత్రికి తరలింపుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. దాంతో కేసీఆర్ ఈ విషయాన్ని వదిలేశారు. అయితే, సచివాలయాన్ని నిజంగా తరలించాలన్నది కేసీఆర్ ఉద్దేశం కాదని, అలా అని తరలింపు మొదలుపెడితే సచివాయలం నుంచి చంద్రబాబు ఆయన బృందాన్ని సాగనంపేయాలన్నదే కేసీఆర్ వ్యూహమని ఆ పార్టీ వర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి. అయితే, తన వ్యూహం ఎదురు తన్ని, చాతీ ఆస్పత్రిఃని సంరక్షిస్తామంటూ ప్రతిపక్షాలు ముందుకు రావడం.. మరొక అడుగు వేస్తే అది ఉద్యమ రూపం దాల్చే పరిస్థితులు కనిపించడం కేసీఆర్ ఇక ఆ వివాదానికి అంతటితో ముగింపు పలికేశారని చెబుతున్నారు.
Tags:    

Similar News