కరోనా నిబంధనలు ఎత్తి వేయడంపై నిపుణులు సూచనలేంటో తెలుసా?

Update: 2022-03-28 00:30 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడ లాడించింది. రెండేళ్ల నుంచి కొత్త కొత్త రూపాలను మార్చుకుంటూ ప్రజలపై తన పంజా విసురుతోంది. అన్ని దేశాలను ఆర్థికంగా, మానసికంగా అతలాకుతలం చేస్తోంది. తగ్గింది అనుకునే లోపే కొత్త వేరియంట్ తో వచ్చి ప్రజల ప్రాణాలను కబళిస్తోంది. అయితే భారతదేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 182.3 కోట్లకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.

అయితే గతంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చి రెండేళ్లకు అంటే మార్చి 31 నుంచి అన్ని నిబంధనలను ఎత్తివేయాలని నిర్ణయించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి మాత్రం కొనసాగుతాయని తెల్పింది. అయితే మళ్లీ కొత్త కరోనా నాలుగో వేవ్ రావడం కొందిరిని తీవ్ర భయాందళోనలోకి నెడ్తోంది.

మన జనాభా, టీకా ఇన్ఫెక్షన్ స్థితిని పరిగణలోకి తీసుకుంటే... మనం ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్ సాంకేతిక సలహాదారు డాక్టర్ అభా సభిఖి తెలిపారు. మన దేశంలో ప్రధానంగా యువత ఎక్కువగా ఉన్నారని... టీకాలు తీసుకోని పిల్లల్లో 80 శాతం వరకు కరోనా యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్లు వివరించారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మరింత అవగాహన అవసరం అని సూచించారు. అంతే కాదు థర్డ్ వేవ్... యూరప్ మొదలైన తర్వాత చాలా ఆలస్యంగా మన దగ్గర మొదలవ్వడం చూశామన్నారు.

అందుకే నాలుగో వేవ్ కూడా మెల్లిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని... ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలిపారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కొవిడ్-19 నిబంధనలను తొలగించారని... అయితే కాస్త సరైన మార్గమేనని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ... అన్ని ఆంక్షలను ఉపసంహరించడం వలన వైరస్ వ్యాప్తి అవకాశాలు పెరుగుతాయని... ఇది ఆగ్య మౌలిక సదుపాయాలపై భారం పడవచ్చని కొందరు వైద్య నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుందంటూ ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ యూనిట్ హె పల్మోనాలజీ డాక్టర్ రవి శేఖర్ ఝూ గుర్తు చేశారు. ఇప్పుడు కేసుల పెరుగుదులను అంచనా వేయడం కష్టం కాబట్టి కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేయకపోవడం మంచిదన్నారు. పదే పదే డబ్ల్యూహెచ్ఓ నుంచి హెచ్చరికలు అందుతున్నాయని... ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా మార్గదర్శకాలు ఉంటేనే మంచిదని రవి శేఖర్ అభిప్రాయ పడ్డారు. వ్యాక్సినేషన్ యాంటీబాడీలను మాత్రమే అభివృద్ధి చేస్తుందని... ఇన్ఫెక్షన్లు నిరోధించమంటూ పేర్కొన్నారు.

అంతే కాదండోయ్ వ్యాక్సినేషన్ తేలిక పాటి ఇన్పెక్షన్ ను తీవ్రంగా మారకుండా చేస్తుందని వివరించారు. జాగ్రత్తలతోనే కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుందంటూ పేర్కొన్నారు. ఇది మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం అని సూచించారు. దశల వారీగా ఆంక్షలను ఎత్తివేయడం మంచిదే కానీ... నిబంధనలు పూర్తిగా ఎత్తి వేసే ముందు కనీసం ఆరు నెలల పాటు వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవంలంభించాలని ఆయన సూచించారు.
Tags:    

Similar News