అప్పటి ప్రేమికుడి పాట కు అదరగొట్టే స్టెప్పులేసిన మాజీ ఎంపీ

Update: 2020-02-01 04:11 GMT
కీలక పదవులు చేపట్టినంత మాత్రాన.. అదే పనిగా గంభీరంగా ఉండటం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది చెప్పండి. లోపలి మనిషి అప్పుడప్పుడు తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద బయటకు వచ్చేస్తుంటారు. తాజాగా అలానే బయటకు వచ్చేశాడు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి లోపల నుంచి.

రాజకీయ నేతగా సుపరిచితుడైన ఆయనలోపలి కుర్రాడు బయటకు వచ్చేశాడు. పొలిటిషియన్ గా ఫేమస్ అయిన ఆయన.. అప్పటి ‘ప్రేమికుడు’ చిత్రంలోని పాటకు ఎస్పీ బాలు స్టెప్పులేశాడు. సినిమాలో ప్రభుదేవా.. ఎస్పీ బాలు స్టెప్పులేసిన దానికి ఏ మాత్రం తగ్గకుండా.. తన మేనల్లుడి తో కలిసి కాలు కదిపాడు. తనకు అలవాటు లేని స్టెప్పుల యవ్వారమైనప్పటికీ ఉత్సాహంతో వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

హైదరాబాద్ లో తన బంధువుల వివాహ వేడుకకు హాజరైన ఆయన.. వేదిక మీద తన టాలెంట్ ను చూపించేశారు. అందరూ అడిగేయటంతో మాజీ ఎంపీ లాంటి వాటిని పక్కన పెట్టేసి.. తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టారు. మోదుగుల వారి స్టెప్పుల వీడియో ఇప్పుడు వైరల్ అయి.. అందరిని అలరిస్తోంది. సీరియస్ రాజకీయాలకు కాస్త ఆట విడుపుగా ఇలాంటివి నేతలకు కాసింత రిలీఫ్ ను ఇస్తాయనే చెప్పాలి.
Tags:    

Similar News