మళ్లీ కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ హర్షకుమార్

Update: 2020-11-24 09:10 GMT
కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన మాజీ ఎంపీ ఆయన.. కాలం కలిసిరాక పాపం పార్టీ మారారు. ఏపీలో కాంగ్రెస్ కుదేలు కావడంతో ఆ పార్టీని వీడారు. టీడీపీలో చేరారు. కానీ అధికార వైసీపీతో ఢీకొట్టి జైలు పాలయ్యారు. చివరకు తత్త్వం బోధపడి మళ్లీ తిరిగి ఏపీలో అసలు ఉనికే లేని కాంగ్రెస్ లో చేరారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమేన్ చాందీ సమక్షంలో హర్షకుమార్ కాంగ్రెస్ లో తిరిగి చేరారు. సోనియా నాయకత్వంలో తిరిగి పనిచేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి హత్తుకున్నట్లు ఉందని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే హర్షకుమార్ అధికార వైసీపీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతతా ఖబడ్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితులు ఉన్నాయని ఈ మాజీ ఎంపీ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు.

ఇలా మాజీ ఎంపీ అటు తిరిగి ఇటు తిరిగి ఏపీలో బలం లేని కాంగ్రెస్ లో చేరడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా అధికార పార్టీ వైపు లేదంటే ప్రతిపక్ష పార్టీ వైపు అడుగులు వేస్తారు.. కానీ హర్షకుమార్ అస్సలు బలం లేని కాంగ్రెస్ లో చేరడం గమనార్హం.
Tags:    

Similar News