ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా!

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది

Update: 2024-05-06 10:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. 1992 బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి హరీశ్‌ కుమార్‌ గుప్తా.. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా డీజీపీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. ఇవాళ సాయంత్రం లోగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది!

ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌ కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. సాయంత్రం ఐదు గంటల లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

ఇలా మరో వారం రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ అనూహ్యంగా ఏపీ డీజీపీని బదిలి చేయడం, కొత్త డీజీపీని నియమించడంతో ఈ విషయం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News