తిరిగి సొంతగూటికి చేసిన వైసీపీ నేత

Update: 2018-12-31 09:40 GMT
శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్సే గురునాథ్ రెడ్డి  వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు.

గురునాథ్ రెడ్డి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడి సొంతగా పార్టీ పెట్టిన సమయంలో మద్దతుగా నిలిచిన వారిలో ఒకరు. అయితే 2014లో వైసీపీ నుంచి అనంతరం అర్బన్ స్థానంలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ మద్దతుతో టీడీపీలో చేరారు.

టీడీపీ ఆయనకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదు. టీడీపీలో చేరే సమయంలో తనకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో తాను టీడీపీలో ఉండటం కంటే సొంత పార్టీ అయిన వైసీపీలోకి వెళ్లడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి తన అనచరులతో పార్టీలో చేరినట్లు గురున్నాథరెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని గురున్నాథ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని టీడీపీలో చేరానని అది జరుగకపోగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీకి రాజీమానా చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబునాయుడు కేవలం సొంత అజెండాతోనే పని చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి తిరిగి వచ్చని గురున్మాథరెడ్డికి అనంతపురం అర్బన్ స్థానం దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అభ్యర్థిగా తన పని తాను చేసుకుపోతున్నారు. దీంతో గురున్నాథరెడ్డికి ఇదే స్థానం నుంచి చోటు దక్కకపోవచ్చని చర్చ జరుగుతోంది. కాగా గురున్నాథరెడ్డికి మరో చోటు నుంచి జగన్ అవకాశం కల్పిస్తారని సమాచారం.


Full View

Tags:    

Similar News