అమెరికాలో దుర్మార్గం.. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం.. చేసిందెవరంటే?
పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న వేళ.. వాటికి ప్రజాదరణ పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే.. ఉద్యమ ఫలాల్ని సొంతం చేసుకోవటం కోసం దుర్మార్గులు పలువురు బయటకు వస్తారు. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ శివారులో పంజాబ్.. హర్యానాకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నిరసన చేయటం.. గడిచిన రెండు వారాలుగా వణికే చలిలో తాము అనుకున్నట్లుగా చేయటం తెలిసిందే.
వీరికి మద్దతుగా దేశ విదేశాల్లో పలువురు నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో దుర్మార్గం చోటు చేసుకుంది. భారత్ లో సిక్కు రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిర్వహించిన కారు ర్యాలీ అదుపు తప్పింది. ఈ నిరసన పంజాబ్ వేర్పాటు దారుల చేతుల్లోకి వెళ్లిందన్న సందేహాన్ని కలిగేలా చర్యకు పూనుకున్నారు.
అమెరికాలోని పలు నగరాల్లో భారత రైతులకు మద్దుతుగా కారు ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్.. న్యూజెర్సీ.. నార్త్ కరోనలినా.. పెన్సిల్వేనియా.. ఇండియానా.. ఒహియో తదితర నిగరాల్లో ర్యాలీగా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. వాషింగ్టన్ లోని భారత ఎంబసీ వద్ద నిరసన తెలిపారు. ఇదే అదునుగా తీసుకున్న ఖలీస్తానీ వేర్పాటు వాదులు నిరసనకారులతో కలిసి పోయారు. తమ వెంట తెచ్చుకున్న జెండాల్ని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి కప్పేసి.. ధ్వంసానికి పాల్పడ్డారు. కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన సెక్యురిటీ అధికారులు వారించటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది.
జాతిపిత విగ్రహాంపై జరిగిన దాడిని భారత ఎంబసీ తీవ్రంగా ఖండించంది. ఈ దుశ్చర్యకు కారణమైన వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని.. నిందితుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెబుతున్నారు. ఇలాంటి నేరాలకు అమెరికాలో శిక్షలుకఠినంగా ఉంటాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా తేలితే.. పదేళ్ల జైలు శిక్షను విధిస్తుంటారు. తాజాగా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి కూడా ఇలాంటి శిక్షనే విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.