అందరూ హరీష్‌ పైనే.. ఏం జరుగుతోంది.

Update: 2019-02-19 08:59 GMT
తెలంగాణలో ఎన్నికలు అయిన దాదాపు వందరోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేశారు కేసీఆర్‌. ఈ మంత్రివర్గ విస్తరణలో హరీష్‌ రావుకి కూడా చోటు లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హరీష్‌ రావుని దూరం పెట్టారు కేసీఆర్‌. మరోవైపు.. హరీష్‌ కూడా ఎన్నికలు పూర్తైన తర్వాత దాదాపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో.. హరీష్‌ని సాగనంపే కార్యక్రమాలు ఊపందుకున్నాయని రాజకీయ వర్గాల్లో వన్పిస్తున్న మాట.

ఇక టీఆర్ ఎస్‌ పార్టీలో చాలామంది నేతలున్నా.. అందరి టార్గెట్‌ మాత్రం హరీష్‌ రావే. మొన్నటికి మొన్న మిడ్‌ మానేరు నిర్వాసితుల వ్యవహారాల్లో హరీష్‌ అక్రమాలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి. ఆ తర్వాతి రోజు రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చారు. హరీష్‌.. బీజేపీ అధినేత అమిత్‌ షాతో టచ్‌ లో ఉన్నారని.. అందుకే అతనికి మంత్రిపదవి రాలేదని బాంబ్‌ పేల్చారు. ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో రావడం.. హరీష్‌ ని టార్గెట్‌ చేయడమే కన్పిస్తోంది. అయితే వీటికి హరీష్‌ కూడా కౌంటర్‌ ఇవ్వకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదంతా టీఆర్ ఎస్‌ పార్టీ పెద్దలే వెనకుండి చేయిస్తున్నారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. మరి ఇలా పరిణామాలన్నింటికి హరీష్‌ రావు ఏ విధంగా బదులు ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News