భారత్, అమెరికాకు షాకిచ్చిన ఈయూ
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యూరప్ దేశాలు తాజాగా 15 దేశాలకు చెందిన టూరిస్టుల కోసం తమ సరిహద్దులను తెరుస్తున్నామని ప్రకటించాయి. విచిత్రంగా యూరప్ దేశాలకు అత్యంత సన్నిహితమైన అమెరికా, రష్యానే కాదు.. భారత్, బ్రెజిల్ దేశాల వాసులకు నో ఎంట్రీ అని యూరోపియన్ యూనియన్ (ఈయూ) సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత్, బ్రెజిల్, అమెరికా, రష్యా దేశాల వారిని యూరప్ లోకి అనుమతించే ప్రసక్తే లేదని తాజాగా అన్ని దేశాల కూటమి స్పష్టం చేసింది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్నందునే అమెరికా, భారత్, రష్యా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించమని పేర్కొంది.
ఇక కరోనా వైరస్ నియంత్రించిన న్యూజిలాండ్, జపాన్, మొరాకో, మాంటినీగ్రో, జార్జియా, కెనడా, ఆస్ట్రేలియా,అల్జీరియా తదితర కరోనా తీవ్రత తక్కువగా ఉన్న 15 దేశాల వారికి అనుమతి ఇస్తున్నట్టు ఈయూ పేర్కొంది.
ఇక చైనా సరిహద్దులు ఓపెన్ చేస్తేనే తమ దేశ టూరిస్టులను అనుమతిస్తేనే తాము చైనా వారిని రానిస్తామని ఈయూ షరతు పెట్టినట్టు తెలిపింది. ఈ లిస్టును ప్రతీ 14 రోజులకు ఒకసారి అప్ డేట్ చేస్తామని.. కొన్ని దేశాలకు మినహాయింపులు, రద్దులు చేస్తామని తెలిపింది. కరోనా ఫ్రీ దేశాలకే తమ దేశంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.