రోటీన్ కు భిన్నం ఈ దొంగలు.. బస్టాప్ నే దొంగతనం చేశారు

Update: 2020-10-22 11:30 GMT
దొంగలు.. దొంగతనాలు కామన్. రోటీన్ కు కాస్త భిన్నంగా అప్పుడప్పుడు కొందరు దొంగలు చేసే చోరీలు ఉంటాయి. బస్సులు.. లారీలు.. చివరకు రైళ్లను చోరీ చేసే దొంగల్ని విని ఉంటాం. తాజా మహారాష్ట్రలోని ఫూణెలో చోటు చేసుకున్న దొంగతనం మాత్రం ఇప్పటివరకు విని ఉండం. ఇంతకీ ఈ వెరైటీ దొంగలు దోచేసింది ఏమిటో తెలుసా?ఒక బస్ స్టాప్ ను. నిజమే.. మీరేమి తప్పు చదవలేదు.

ఫూణె మహానగర్ పరివహన్ సంస్థ ప్రజల కోసం దేవాకి ప్యాలెస్ ముందు బిటి కవాడే వద్ద ఒక బస్ స్టాప్ ను ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రి సదరు బస్ స్టాప్ లేకపోవటంతో అధికారులు.. స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై అక్కడి మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ ఒక ప్రకటన చేస్తూ.. ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ చోరీకి గురైంది. నిందితుల వివరాలు తెలియజేస్తే రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. అక్కడ అసలు బస్ స్టాపే లేదని.. కావాలనే అలా చేసి ఉంటారని కొందరు పేర్కొంటే..  మరో వ్యక్తి మాత్రం.. తాను అక్కడి వీధి వ్యాపారుల్ని బస్ స్టాప్ గురించి అడిగానని.. రాత్రి వరకు ఉందని.. పొద్దున వచ్చేసరికి లేదని చెప్పారన్నారు. అక్కడ బస్ స్టాప్ ఉన్నది నిజం.. దాన్ని ఎవరు దొంగతనం చేశారో తెలీదు కానీ.. అక్కడైతే చోరీ జరిగిన మాట వాస్తవమని తేల్చారు. కలికాలం అంటే ఇదేనేమో? చివరకు బస్ స్టాప్ లను కూడా వదలని తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News