రోహింగ్యాలను, పాకిస్తానీలను తరిమి తరిమి కొడతాం: బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది. ముఖ్యంగా ఎంఐఎంను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతల మాటలను బట్టి టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీని బూచీగా చూపిస్తున్నట్టు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాజాగా వరుసగా రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి.. రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. పాతబస్తీలో ఓటర్లు లేని ఎన్నికలు జరగాలన్నారు. అయితే ఎంఐఎం నేత అసదుద్దీన్ పాతబస్తీలో రోహింగ్యాలుంటే అమిత్ షా ఏం చేస్తున్నారని వాఖ్యానించారు. దీనికి బదులుగా బండి సంజయ్ రోహింగ్యాలను తరమికొడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అసదుద్దీన్ పై దుమ్మెత్తిపోశారు. ‘ఆసద్దుద్దీన్ బీజేపీ వాళ్లకు బిర్యానీ తినిపిస్తాడు అంట.. మేము కూడా అసదుద్దీన్ కి బిర్యానీ తినిపిస్తాం.. మా దగ్గర వాల్మీకి సమాజ్ వాళ్ళు పిగ్ (పంది) బిర్యానీ బాగా చేస్తారన్నారు’అని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శలు గుప్పించారు. ‘1948లో హైదరాబాద్ ను పాకిస్థాన్ లో కలపాలని ఎంఐఎం కోరింది. బీహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్థాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారిందన్నారు. ఢిల్లీ మున్సిపాలిటీ లో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ చెప్పింది, చేస్తుందన్నారు మురళీధర్ రావు. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుందని, ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదన్నారు బీజేపీ మురళీధర్ రావు.
ఇలా ముగ్గురు నేతలు తాజా వ్యాఖ్యలతో ఎంఐఎంను టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. దీన్ని బట్టి పాతబస్తీపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ మొదలైనట్టే కనిపిస్తోందని తెలుస్తోంది.