ఆ దేశం వెళుతున్నారా బీకేర్ ఫుల్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ

ఇంతకూ ఆ దేశం పేరేమంటే.. అక్కడికే వస్తున్నాం. ‘ఎస్వతిని’. కొన్నేళ్ల క్రితం వరకు స్వాజిలాండ్ గా పిలిచిన ఆ దేశం తన పేరును ‘ఎస్వతిని’గా మార్చుకుంది.;

Update: 2026-04-25 06:30 GMT

అవును.. ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం గురించి తెలిస్తే.. ఒళ్లు చెమటలు పట్టాల్సిందే. యూట్యూబ్.. సోషల్ మీడియా పుణ్యమా ప్రపంచంలోని ఏ మూలన ఉన్న దేశానికైనా టూరిస్టుగా వెళ్లటం.. అక్కడి అందాల్ని.. ఆ దేశ ప్రత్యేకతల్ని చెప్పే వారి సంఖ్య పెరిగింది. దీని పుణ్యమా అని వివిధ దేశాల్ని పర్యటించే అభిలాష ఉండే వారు.. ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి. అయితే.. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం గురించి తెలిస్తే మాత్రం వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ దేశం గురించి తెలిస్తే.. ఆ దేశం దరిదాపుల్లోకి వెళ్లేందుకు సైతం భయపడతారు. ఎందుకంటే.. ఆ దేశంలోని 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ ఐవీ పాజిటివ్ ఉండటమే దీనికి కారణం.

ఇంతకూ ఆ దేశం పేరేమంటే.. అక్కడికే వస్తున్నాం. ‘ఎస్వతిని’. కొన్నేళ్ల క్రితం వరకు స్వాజిలాండ్ గా పిలిచిన ఆ దేశం తన పేరును ‘ఎస్వతిని’గా మార్చుకుంది. ఈ దేశం మొత్తం జనాభా 12 లక్షలు మాత్రమే కానీ.. వీరిలో మూడు లక్షల మంది హెచ్ ఐవీ పాజిటివ్ అయిన వారే ఉండటం గమనార్హం. ప్రతి ఏడాది దాదాపు 7 వేల మంది హెచ్ఐవీ బారిన పడుతున్నట్లుగా చెబుతారు. మరో షాకింగ్ నిజం ఏమంటే.. హెచ్ఐవీ బారిన పడిన వారిలో పురుషుల కంటే.. మహిళలే ఎక్కువగా ఉంటారు.

యువత ఎక్కువగా హెచ్ ఐవీ బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. చిన్న దేశమే కాదు.. నిరుపేద దేశం కూడా. జనాభాలో 60 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తుంటారు. పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ దేశస్తులు.. తమ పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా గనుల్లో కూలీ పనుల కోసం వెళతారు. ఎస్వతిని సంప్రదాయ న్రత్యం రీడ్ డ్యాన్స్. దీనిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

అయితే.. చాలామంది చెప్పే మాట ఏమంటే.. విదేశీయుల వద్దకు నిరుపేద మహిళలు డబ్బుల కోసం సెక్సు చేస్తుంటారన్నది ఆ దేశాన్ని.. ఆ దేశ ప్రజల్ని తక్కువ చేసి చూపించటమే అవుతుంది. ఎందుకంటే.. నిరుపేద దేశమే అయినా.. ఇక్కడి ప్రజల సంప్రదాయవాదులు. ఆ దేశంలోని సంప్రదాయమే ఈ దరిద్రపుగొట్టు పరిస్థితికి కారణంగా చెబుతారు. ఈ దేశ మగవారు తమ మగతనానికి నిదర్శనంగా ఎక్కువమంది భార్యల్ని కలిగి ఉంటారు. ఎక్కువమంది మహిళలతో సెక్సు చేయటం గొప్పగా భావిస్తారు. ఈ తీరే.. హెచ్ఐవీ భారీ పెరుగుదలకు కారణం.

చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు.. తమ కంటే వయసులో పెద్దవారైన పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం.. సురక్షిత పద్దతుల్నిపాటించకపోవటం.. అమ్మాయిలతో ఎక్కువగా కలిసే పురుషుల కారణంగా హెచ్ఐవీ అంతకంతకూ పెరిగి.. ఈ రోజు తీవ్రస్థాయికి చేరుకుంది. 1986లో హెచ్ఐవీ కేసు ఈ దేశంలో వెలుగు చూసింది. అయితే.. ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోని కారణంగా సమస్య తీవ్రత పెరిగింది.ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది.

ఇదంతా చూసినప్పుడు ఈ దేశం ఏ మాత్రం సేఫ్ కాదన్న భావన కలగొచ్చు.కానీ.. అందులో నిజం లేదని చెబుతారు, ఎంుదకంటే.. ఈ దేశం విదేశీ పర్యాటకులతో అత్యంత స్నేహపూర్వకంగా ఉంటారు. అలా అని వారిని తప్పు కోణంలో చూడటం సరికాదంటారు. పర్యాటకుల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించి.. సాదరంగా ఆహ్వానిస్తారు. అలా అని సెక్సు కోసం అని భావిస్తే తప్పులో కాలేసినట్లే. విదేశీయులకు తమ ఆచారాల గురించి వివరించేందుకు వారెంతో ఇష్టపడతారు. ఈ దేశంలో పర్యటించటం ద్వారా ఆఫ్రికా కల్చర్.. ప్రకృతిని అతి తక్కువ సమయంలో ఎంజాయ్ చేసే అనుభవం సొంతం అవుతుంది.

ఈ దేశానికి వెళ్లే విదేశీయులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కొందరు మహిళలు డబ్బుల కోసం సురక్షితం కాని సెక్సులో పాల్గొంటారు. అది కూడా స్థానికులతోనే. దీనికి తోడు ఆ దేశంలోని పురుషులు కండోమ్స్ వాడేందుకు ఇష్టపడరు. దీనికి తోడు మహిళలకు సురక్షిత శృంగారం గురించి నిర్ణయం తీసుకునే అధికారం తక్కువగా ఉండటంతో వారు హెచ్ఐవీ బారిన పడుతుంటారు.

ఈ దేశ జనాభాలో 97 శాతం మంది స్థానిక ఆఫ్రికన్లు కాగా.. మిగిలిన మూడు శాతం మంది యూరోపియన్లు. ఇక్కడి ప్రజలు దృఢమైన ఆకృతితో ఉండటం కనిపిస్తుంది. పర్యాటక వీసాలపై వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు ఈ దేశంలో. అందుకు కఠిన జైలు శిక్షల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ దేశంలో ఇప్పటికి రాజరికం నడుస్తోంది. ఈ దేశంలో వ్యభిచారం చట్టవిరుద్ధం. బహిరంగ ప్రదేశాల్లో సెక్సు కోసం తిరిగితే నేరంగా పరిగణిస్తారు. పదేళ్లు జైలుకు అవకాశం ఉంది. మొత్తంగా ఈ దేశాన్ని కల్చర్ పరంగా చూసేందుకు వస్తే ఎంతో బెటర్. కానీ.. హెచ్ఐవీ ఇంత భారీగా ఉన్న దేశానికి టూరిస్టులు అడుగు పెట్టేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News