ఏనుగు మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

Update: 2020-06-05 03:30 GMT
పైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును కేరళలో చంపిన దారుణ ఘటన యావత్ భారతదేశాన్ని కదిలించింది. ఇలా ఏనుగులను చంపుతున్న వారిని వదిలిపెట్టవద్దన్న డిమాండ్లు మీడియాలో వ్యక్తమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో కేరళసీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు.

గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనలో ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించి అరెస్ట్ చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని ట్విట్టర్ ద్వారా కేరళం సీఎం విజయన్ ప్రకటించారు.

కేరళలో ఇప్పటికే పైనాపిల్ సహా పండ్లలో బాంబులు పెట్టి అవి తింటుండడగా పేలి రెండు ఏనుగులు చనిపోయాయి. ఏనుగులను వేటగాళ్లు ఇలా చంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన మల్లపురం జిల్లాలో జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ తెలుపగా.. పాలక్కడ్ జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
 
గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం విజయన్ తెలిపారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులకు కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇది మన దేశ సంస్కృతి కాదన్నారు.

పైనాపిల్ తినడం వల్ల చనిపోయి ఉండక పోవచ్చని.. అడవి పందుల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిని మరణించవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News