తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రాష్ట్రాల పెద్దల సభ అయిన శాసనమండలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా బీహార్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని ఒక్క స్థానానికి, బీహార్ లోని నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ వెలువరించనున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 9వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 15వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాలలోనూ ఉపాధ్యాయ పట్టభద్ర స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు తమ ప్రచారా పర్వాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వ మద్దతుతో బరిలోకి దిగాలని భావిస్తున్న అభ్యర్థులు పరిపాలన పరమైన అంశాలను ప్రస్తావిస్తుండగా...విపక్ష, స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు ప్రజా సమ్యలపై ప్రభుత్వ వైపల్యాలను తమ అస్త్రాలుగా చేసుకున్నారు. ఇప్పటికే వామపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో ఉంచాయి. అధికార పార్టీలు తగిన నాయకులను గుర్తించినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/