ఐన్​స్టీన్​ భార్య రాసిన ఓ ఉత్తరం బయటపడింది.. ఆ లెటర్​లో ఏముందంటే?

Update: 2021-03-03 23:30 GMT
ఎప్పుడో వందేళ్ల క్రితం రాసిన ఓ ఉత్తరం ఇప్పుడు బయటకొచ్చింది. ఆ లెటర్​ను ఐన్​స్టీన్​ భార్య తన కజిన్​కు రాశారు. ఈ ఉత్తరంలో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ఐన్​స్టీన్​ ఓ శాస్త్రవేత్త మాత్రమే కాదని.. ఆయనలో ఓ కాలజ్ఞుడు (భవిష్యత్​ను ఊహించేవాడు) కూడా ఉన్నారని ఆయన భార్య ఆ ఉత్తరంలో రాశారు.

ఐన్​స్టీన్​ మొదటి భార్య 1919 వ సంవత్సరంలో చనిపోయారు. అయితే కుటుంబసభ్యులు, బంధువుల సూచనతో ఆయన తనకంటే మూడేళ్ల ఎక్కువ వయస్సు ఉన్న ఎల్సాను వివాహం చేసుకున్నాడు. ఎల్సాతో పెళ్లి జరిగినప్పుడు ఐన్​స్టీన్​ వయసు 40 ఏళ్లు.. ఎల్సా వయస్సు 43 ఏళ్లు. అయితే ఎల్సా ఐన్​స్టీన్​కు ఓ సలహాదారుగా కూడా వ్యవహరించేవారు.

ఆమె నిత్యం ఐన్​స్టీన్​ గేట్​ దగ్గర కూర్చొనేవారు. ఆ రోజుల్లో ఐన్​స్టీన్​ను చూడటానికి చాలా మంది వస్తుండేవారు. అయితే ఆయన మాత్రం తన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పరిశోధనలో నిమగ్నం అయి ఉండేవాడు. దీంతో ఆయన పరిశోధనకు అంతరాయం కలుగకూడదని అటువంటి వాళ్లను ఆమె లోపలికి రానిచ్చేవారు. ఇదిలా ఉంటే ఎల్సా రాసిన లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఐన్​స్టీన్​ గురించి వివరిస్తూ ఎల్సా తన కజిన్​కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘ఐన్​స్టీన్​ను చాలా మంది భౌతికశాస్త్రవేత్త అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయనలో చాలా కోణాలు ఉన్నాయి. ఆయన ఓ కాలజ్ఞుడు. భవిష్యత్ ​ను ముందే ఊహించేవాడు. హిట్లర్​ జైలు నుంచి విడుదలయ్యాక.. యూధులను ఊచకోత కోస్తాడని ఐన్​స్టీన్​ ముందే ఊహించాడు.

అంతేకాక ఆయన అధికారం చేపడతాడని కూడా ఐన్​స్టీన్​ ఊహించాడు. ఈ విషయాన్ని ఐన్​స్టీన్​ నాతో చెప్పారు’ అని ఆమె లెటర్​ లో పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఐన్​స్టీన్​కు సొంతంగా ఇళ్లు కూడా ఉండేది కాదట. దీంతో ఎల్సా దగ్గరుండి మరి ఐన్ ​స్టీన్​ కోసం ఇళ్లు కట్టించిదట. ఇలా ఆమె పలు విషయాల ను ఈ లేఖ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనం గా మారింది.
Tags:    

Similar News