• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒమిక్రాన్ ప్రభావం చాలా...

ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువ.. ఎందుకో తెలుసా?

By - Tupaki Desk
Update: 2022-02-05 02:30 GMT
కరోనా వైరస్ గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. వేరియంట్ల రూపంలో దశలవారీగా కోరలు చాస్తోంది. మన దేశంలో గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాదిలోని జనవరి మొదటి రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఇతర దేశాల్లో పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉంది. ఒక్కో దేశంలో ఒక్కో పరిస్థితి ఉంది. అయితే ఇటీవల వైరస్ కేసులు పెరగడానికి కారణం దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఒమిక్రాన్. దీని కారణంగా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ వేరియంట్ కు అతి త్వరగా వ్యాపించే లక్షణం ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కానీ దీని ప్రభావం మాత్రం చాలా తక్కువేనని చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్ కు జెట్ స్పీడ్ లో వ్యాపించే లక్షణం ఉంటుందన్న వైద్య నిపుణులు... మన ఆరోగ్యంపై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలపై అమెరికా పరిశోధకులు అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన నివేదిక న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితం అయింది. ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉండటానికి కారణం మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి అని శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్లు, వైరస్ నుంచి పొందిన రోగ నిరోధక శక్తి వల్లే కొత్త వేరియంట్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అన్నారు. వైరస్ వ్యాపించినా కూడా అందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని గుర్తించారు. ఆస్పత్రిలో చేరిక, వైద్యుల చికిత్స చాలా తక్కువ మందికి అవసరం అయ్యాయని.. మెజారిటీ మంది ఇంట్లోనే కోలుకున్నారని వెల్లడించారు.


ఈ కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికా లోని బోట్సునావాలో వెలుగు చూసింది. అయితే అప్పటి నుంచి తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంది. దీనికి కారణం ఆ దేశంలో చాలా మంది వైరస్ తీసుకుని ఉండడం లేదా ఇదివరకే మహమ్మారి బారిన పడడం. ఈ రెండు మార్గాల్లో ఆ దేశ ప్రజలు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్పారు. అందువల్లే వేరియంట్ ముందు నుంచి అతి తక్కువ తీవ్రత కలిగి ఉందని అన్నారు. ప్రభావం తక్కువగా ఉన్నా కూడా వ్యాప్తి మాత్రం అధికంగా ఉంది. అంతేకాకుండా ఇతర వేరియంట్ల పుట్టుకకు కారణమైంది.

వ్యాక్సిన్ తీసుకోవడం లేదా కరోనా బారిన పడి కోలుకోవడం వల్ల వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇకపోతే వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని సూచిస్తున్నారు. టీకా తీసుకుంటే వైరస్ నుంచి ముప్పు చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. వేరియంట్లు పుట్టుక సమయంలోనే చాలా తక్కువ ప్రభావం చూపే విధంగా రూపొందుతాయని చెబుతున్నారు. అలా అయితే కొత్త రకాలు వచ్చినా కూడా పెద్దగా ప్రభావం ఉండదని... ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. ఇకపోతే భారతదేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు చురుగ్గా సాగుతోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా క్రమంగా దిగువకు వస్తోంది.
Tags:    
  • omicron 
  • omicron effect 
  • omicron cases 
  • omicron cases in india 
  • omicron in hyderabad 
  • omicron symptoms 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS