ముగిసిన విచారణ.. కవిత విడుదల

Update: 2023-03-21 22:04 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత  విచారణ ముగిసింది. 3వ రోజు అరెస్ట్ ఊహాగానాల మధ్య కవితను ఈడీ అధికారులు విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.  ఇప్పటికి రెండు సార్లు ఆమెను ఈడీ విచారించింది. ఈరోజు మూడోరోజు. స్కాంలో పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించింది.

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 8 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. 8.30గంటలకు బయటకు వచ్చినట్టు తెలిసింది.  ఇవాళ్టికి కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు.

కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భారత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భారత్ ను కార్యాలయంలోకి పిలిచారు. కవితకు సంబ:దించిన ఆథరైజేషన్ సంతకాల  కోసం పిలిచినట్టు సమాచారం.  తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్ ని పంపించేందుకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భారత్ కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది.

ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళుతున్నట్టు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని చార్జీషీట్ లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో  విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తుకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News