5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ

Update: 2023-06-03 10:04 GMT
మరి కొద్దినెలల్లో ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నాలుగైదు నెలల్లో జరిగే వీలున్న ఈ ఎన్నికలకు సంబంధించిన కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం షురూ చేసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. తాజాగా కీలక ఆదేశాల్ని జారీ చేసింది.

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోస్టుల్లో మూడేళ్లకు మించి పని చేయకూడదన్న ఆదేశాన్ని జారీ చేశారు. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ కూడా తమ రక్త సంబంధీకులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయటం లేదన్న డిక్లరేషన్ ఇవ్వటంతోపాటు.. తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్న విషయాన్ని స్పష్టం చేయాలంటున్నారు.

అంతేకాదు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్న సూచన చేసింది. అంతేకాదు. జిల్లా స్థాయిలో ఏయే ఉద్యోగులకు నిబంధనలు వర్తిస్తాయన్న వివరాల్ని సర్క్యులర్ లో వెల్లడించారు. అధికారుల బదిలీలు.. పోస్టింగ్ లకు సంబంధించి జులై 31 లోపు ఈసీకి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఐదు రాష్ట్రాల చీఫ్ ఎన్నికల కమిషనర్లకు లేఖ రాసింది. సో.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.

Similar News