ఏపీ పాలిటిక్స్: బలమైన నాయకులు - బలహీన విధానాలు..!
బలమైన నాయకులు ఉన్నా.. విధానా ల పరంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. బలహీనంగా ఉంటున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.;
ఏపీ రాజకీయాలను పరిశీలిస్తున్న వారు.. ఈ మాటే అంటున్నారు. బలమైన నాయకులు ఉన్నా.. విధానా ల పరంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. బలహీనంగా ఉంటున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఈ వ్యవహారం అదికార పార్టీల నుంచి ప్రతిపక్షం వరకు కనిపిస్తోందని అంటున్నారు. సాధారణంగా బలమైన వ్యూహం ఉంటే.. బలమైన విధానం వస్తుంది. అప్పుడు బలహీనులైన నాయకులు ఉన్నా.. వారు కూడా బలమైన నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
కానీ.. ఇది కనిపించడం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. టీడీపీ విషయానికి వస్తే.. బలమైన నాయకులకు కొదవ లేదు. కానీ.. అధినేత చంద్రబాబు ఇస్తున్న ఆదేశాలను, ఆయన తీసుకుంటున్న విధానాలను ఎంత మంది పాటిస్తున్నారన్నది ప్రశ్న. ఈ విషయంలో నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తృప్తి-అసంతృప్తి మధ్య నాయకులు ఊగిసలాడుతున్నారు. దీంతో పార్టీలో బలమైన నాయకులు ఉండి కూడా.. ఇబ్బందులు తప్పడం లేదు.
ఇక, జనసేన విషయానికివస్తే.. ఎన్నికలకు ముందు నాయకులు బలంగా పనిచేశారు. కాపు సామాజిక వర్గా న్ని ఏకతాటిపై నడిపించారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీకదిలించారు. పవన్ ప్రాధాన్యం వివరించారు. ఫలితంగా అనైక్యత నుంచి ఐక్యత దిశగా నాయకులు నడిపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత.. బలమైన విదానాలను అనుసరించకపోవడంతో పార్టీ అంటే.. కేవలం పవన్ కల్యాణ్ అనే పరిస్థితి వచ్చిం ది. ఆయన బయటకు వస్తే.. రాజకీయం పుంజుకుంటోంది. లేకపోతే లేదన్నట్టుగానే వ్యవహారం ఉంది. ఇది బలహీన విధానాన్ని చెబుతోంది.
వైసీపీ ఇంతకన్నా దారుణంగా ఉంది. అధినేత బలమైన విధానాలను ఎంచుకోలేక పోతున్నారనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. పుంజుకునేందుకు.. పార్టీని నిలబెట్టేందుకు అవసరమైన.. విధానాలను అనుసరిం చక పోగా.. గంజాయి బ్యాచ్ కుటుంబాలను పరామర్శించడం..అమరావతి రాజధాని వ్యవహారంపై అవాకు లు పేలినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వంటి కారణంగా.. బలమైన నాయకులు కూడా.. బలహీనంగా మారుతున్నారు. పోనీ.. పార్టీలో బలమైన నాయకులు లేరా? అంటే ఉన్నారు. కానీ, ఈ తరహాలో విధానాలు ఉంటే వారు మాత్రం ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల మాట.