అంబటి...కొత్త డ్యూటీ !

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. రాజకీయంగా చూస్తే మూడున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది 1989లోనే తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు.;

Update: 2025-06-16 18:01 GMT

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. రాజకీయంగా చూస్తే మూడున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది 1989లోనే తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయనే మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆ కుటుంబానికే కట్టుబడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నా ఓడినా అంబటి రాంబాబు వాయిస్ లో మార్పు ఉండదు, సౌండ్ లో తేడా అంతకంటే ఉండదు.

ఆయన దాదాపుగా ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి తమ పార్టీని కాసుకుంటూనే ఉంటారు. అధికార కూటమిని బాగా వేసుకుంటూనే ఉంటారు. ఇదిలా ఉంటే అంబటికి కొత్త డ్యూటీ అని ఇపుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ డ్యూటీ ఏమిటి అంటే వైసీపీ తరఫున కానీ వైసీపీ సానుభూతిపరులుగా ఉంటూ కానీ వివిధ కేసులలో జైలుకు వెళ్ళిన వారు బెయిల్ మీద బయటకు వచ్చినపుడు తొలి స్వాగతం పలికే డ్యూటీ ఆయనదే అంటున్నారు.

అంబటి వారిని వెల్కం చెబుతూ వారిని మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుంటూ ఎంతో నైతిక ధైర్యం కల్పిస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ మధ్య వైసీపీ నాయకుడు పోసాని క్రిష్ణ మురళి జైలులో చాలా కాలం గడిపి గుంటూరు నుంచే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చినపుడు అంబటి ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికారు.

ఇపుడు ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన సందర్భంగా కూడా అంబటి గుంటూరు జైలుకు వెళ్ళి మరీ ఆయనకు స్వాగతం పలికి ఆయనను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. ఈ ఇద్దరే కాదు చాలా మంది నేతలకు ఆయన ధైర్యంగా ఉంటున్నారు. పరామర్శిస్తున్నారు పలకరిస్తున్నారు. వారి విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద మీడియా ముఖంగా పెద్ద గొంతు వేసుకుని మరీ విమర్శలు చేస్తున్నారు.

ఆ మధ్యన ఆయన ఒక కేసు విషయంలో తానే వకాల్తా పుచ్చుకుని వాదించారు అని ప్రచారంలో ఉంది. న్యాయశాస్త్రం చదివిన అంబటి న్యాయవాదిగా కూడా పనిచేసారు ఇలా అంబటి వైసీపీకి జగని కి వెన్ను దన్నుగా ఉండడమే కాదు పార్టీ నేతలకు కూడా బాసటగా ఉంటూ జైలు ఓదార్పులు చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో అంబటి రాంబాబు లాంటి వారు చాలు కదా అన్న చర్చ కూడా ఉంది

అయితే అంబటి డ్యూటీ కేవలం ఈ ఏడాదితో అయిపోయేది కాదని మరో నాలుగేళ్ళ పాటు ఇలాగే చేయాలేమో అన్న కామెంట్స్ సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే జైలుకు వెళ్ళిన వారు బెయిల్ మీద బయటకు వస్తూంటే బయట ఉన్న వారు జైలుకు వెళ్తున్నారు. మరి ఈ రాకపోకలు ఇప్పట్లో ఆగేవి కావని అంటున్నారు. సో అంబటి వారి కొత్త డ్యూటీ అలా కొనసాగాల్సిందేనా అంటే ఏపీ రాజకీయాలు చూస్తే అదే నిజం అంటున్నారుట.

Tags:    

Similar News