బాబు చెప్తున్నది నిజమేనా? వాస్తవమేంటి?

Update: 2018-01-18 08:31 GMT
‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉంది’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తెలిపారు. అయితే సంబంధిత వెబ్‌ సైట్లో ఉన్న వివరాలు చూస్తే చంద్రబాబు క్లెయిమ్ చేసుకుంటున్న ఫస్ట్ ప్లేసు పశ్చిమబెంగాల్ ఖాతాలో ఉంది. మరి.. చంద్రబాబు ఎందుకిలా చెప్పారన్న ప్రశ్న తలెత్తుతోంది.
    
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ఫ్రీజ్( ఫైనలైజ్ )చేసేవరకూ ఎవరూ క్లెయిమ్ చేసుకోరు. ఎందుకంటే అవి తరచూ మారుతుంటాయి. గత ఏడాది ఏపీ - తెలంగాణలు రెండూ మొదటి స్థానంలో ఉండేవి.. ఈసారి కూడా కొద్ది రోజుల కిందట వరకు తెలంగాణ ఒకటి - రెండు ప్లేసుల్లో ఉంటూ వచ్చింది. కానీ, ఏపీ మాత్రం టాప్‌ లోకి రాలేదు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ తొలి స్థానంలో ఉండగా తెలంగాణ 8 - ఏపీ 10వ స్థానాల్లో ఉన్నాయి. కానీ... చంద్రబాబు మాత్రం ఫస్ట్ ప్లేసు తమదేనంటున్నారు.
    
2018 ఫిబ్రవరి 24-26 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు సన్నాహకంగా న్యూ ఢిల్లీలోని తాజ్ హోటల్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో ఆయన ఈ మాట చెప్పారు. ఆయన ఈ క్లెయిమ్ చేసే సమయానికి ఈ ర్యాంకుల లెక్కలు చూసే కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖకు మంత్రి అయిన సురేష్ ప్రభు అక్కడే ఉండడం విశేషం. అంతేకాదు.. వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు - రాయబారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వారందరి ముందు చంద్రబాబు ఫస్టు ప్లేసు తమదేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News