హైదరాబాద్ లో మళ్లీ భూ ప్రకంపనలు... ఈసారి వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్ లో !
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో చికురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ వాసులను భూప్రకంపనలు మరింత ఆందోళనకి గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. హైదరాబాద్ నగరంలోని ఎల్ బీ నగర్ శివారు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలని బెంబేలెత్తించాయి. ఈ రోజు తెల్లవారు జామున .. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, వైదేహి నగర్ లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి.
ఒక్క సెకండ్ పాటు భూమి కంపించి శబ్దాలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పలుమార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు ఇలా పలు పర్యాయాలు స్వల్ప భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇకపోతే , మొన్న ఆ మధ్య జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు పలుమార్లు భూమి కంపించగా, ఆ తర్వాత గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు భయపెట్టాయి. అంతేకాకుండా, భూమిలోంచి శబ్దాలు కూడా రావడంతో ప్రజలు వణికిపోయారు.