మేయర్ గా హ్యాట్రిక్ కొట్టిన శునకం!

Update: 2016-08-27 07:08 GMT
శునకమేమిటి.. మేయర్ గా ఎంపికవడమేమిటి.. పైగా హ్యాట్రిక్ కొట్టడమేమిటి.. అనుకుంటున్నారా? ఆసక్తి - ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ సంఘటన నిజంగానే జరిగింది. సాదారణంగా మేయర్ అంటే ఒక పట్టణానికి లేక నగరానికి ప్రథమ పౌరుడు. అయితే ఆ ప్రథమ పౌరుడు మనిషే అయ్యి ఉండాలా అనుకున్నారో లేక వారి మనసులను అది ఏస్థాయిలో ప్రభావింతం చేసిందో తెలియదు కానీ.. ఒక శునకానికి ప్రథమ పౌరుడు హోదా కట్టబెట్టారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనకు అమెరికాలోని కార్మొరాంట్ పట్టణంలో చోటుచేసుకుంది.

మనదేశం విషయానికొస్తే మేయర్ గా ఎన్నికయ్యే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉంటాయి. దీంతో ప్రతీ ఐదేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ విషయంలో ఎవరి రాజ్యాంగం ప్రకారం వారి వారి దేశాల్లో మేయర్ ఎన్నికలు జరుగుతాయి. అయితే అమెరికాలోని కార్మొరాంట్ అనే పట్టణంలో డ్యూక్ అనే 9ఏళ్ల వయసున్న శునకం వరుసగా మూడోసారి మేయర్ గా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఈ శునకానికి ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్ధులుగా కూడా ఉన్నారు. అయినా కూడా వారిని చిత్తుచేసి మరీ ఈ శునకం మేయర్ గా గెలుపొందింది. ఇలా ఇప్పటికే రెండు పర్యాయాలు మేయర్ గా పోటీచేసి గెలుపొందిన ఈ డ్యూక్.. తాజాగా మూడోసారి (2016) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఈ సంఘటనలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం డ్యూక్‌ కే ఓటు వేశారట. ఆమాత్రం దానికి పోటీచేయడం ఎందుకు అనే సంగతులు... అంతలా వారిని మంత్ర ముగ్ధుల్ని చేసిన డ్యూక్‌ పరిపాలన సంస్కరణల సంగతి తెలీదు. కానీ.. మేయర్‌గా మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించి అందర్నీ ఆకర్షించింది.
Tags:    

Similar News