బ్రిటీష్ బాడీగార్డుతో దుబాయ్ యువరాణి సీక్రెట్ అఫైర్!

Update: 2020-11-24 02:45 GMT
రాజులు.. రాజ్యాలు పోయి చాలాకాలమైంది. అదంతా మన దగ్గర కానీ.. ప్రపంచం మొత్తం కాదు. ఇప్పటికి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో రాజుల వ్యవహారం నడుస్తోంది. వారి కోటలో జరిగే వ్యవహారాలు చాలావరకు బయటకు రావు. ఇదిలా ఉంటే.. తాజాగా బ్రిటన్ లో ఉంటున్న దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆరో భార్య.. యువరాణి హాయాకు ఒక బ్రిటిష్ బాడీ గార్డుకు మధ్య సీక్రెట్ అఫైర్ ఉందన్న సంచలన విషయాన్ని మొయిల్ ఆన్ లైన్ మీడియా సంస్థ  బయటపెట్టింది. దీనికి సంబంధించిన సంచలన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది.

తమ రహస్య సంబంధాన్ని దాచి పెట్టేందుకు.. బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమె భారీగా ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఆమెకున్న సీక్రెట్ అఫైర్ ఎవరితోనంటే.. ఆమె బ్రిటీష్ బాడీగార్డుతోనేనట. 37 ఏళ్ల బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్ తో ప్రిన్సెస్ హాయా దాదాపు రెండేళ్ల పాటు రహస్య సంబంధాన్ని కొనసాగించినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు.

తమ అనుబంధాన్ని రహస్యంగా ఉంచటం కోసం సదరు బాడీగార్డుకు రూ.12కోట్ల భారీ మొత్తంతో పాటు.. విలువైన వాచ్.. వింటేజ్ షాట్ గన్ తో పాటు ఖరీదైన బహుమతుల్ని కూడా ఇచ్చినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. బాడీగార్డు ఎప్పుడూ తన వెంట తిరిగేలా ఆమె అతడ్ని తనవైపు తిప్పుకున్నట్లుగా సదరు కథనంలో వెల్లడించింది. ఖరీదైన బహుమతులు ఇవ్వటం ద్వారా యువరాణి హాయా.. తన భర్తను ఆమె వెంట తిప్పికున్నట్లుగా బాడీగార్డు భార్య వెల్లడించింది.

ప్రిన్సెస్ హాయాతో తన భర్తకు సీక్రెట్ అఫైర్ ఉందన్న విషయం తెలిసి షాక్ కు గురై ఏడ్చేసినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. భర్తకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే.. దుబాయ్ రాణి బ్రిటన్ లో ఎందుకు ఉంటున్నట్లు? అన్న విషయంలోకి వెళితే.. 70 ఏళ్ల దుబాయ్ రాజుకు ప్రిన్సెస్ హాయాకు మధ్య విడాకుల కేసు లండన్ కోర్టులో విచారణ సాగుతోంది.

ఈ సందర్భంగా రాణి వారికి.. ఆమె బాడీగార్డుకు మధ్యనున్న రహస్య సంబంధం గురించి ప్రస్తావన వచ్చింది. అయితే.. ఈ విషయాన్ని రాణి హాయా ఒప్పుకున్నట్లుగా తాజా కథనంలో పేర్కొన్నారు. తన ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రిన్సెస్ హాయాకు కోర్టు అప్పగించింది. తాజా కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News