దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ..ఎవరంటే
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి అతి త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని దాదాపుగా ప్రకటించినట్టే. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు టి. నర్సారెడ్డి పేరును ఖరారు చేసిందని సమాచారం. ఇకపోతే టి. నర్సారెడ్డి గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆదివారం గాంధీభవన్ లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిల సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఈనెల 7వ తేదీన పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుం దని టీపీసీసీ వర్గాలంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక కోసం 147 మంది ఇన్‌చార్జులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆదివారం ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు ఏడుగురు ముఖ్యనేతలకు, 140 గ్రామాలకు 140 మంది పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఈ నెల 7వ తేదీ నుంచి నియోజకవర్గంలో ఉండి పని చేయాలని ఆయన ఆదేశించారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే
ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు పేరు ఖరారు కావడంతో ఆయన గత నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దిలావుంటే టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రామలింగారెడ్డి భార్య లేదా కుమారుడు పోటీ బరిలో ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మొత్తంగా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ , టి ఆర్ ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 6న ఆయన చనిపోవడంతో ఆరునెలల్లో కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నిక ఆలస్యమవుతుందని భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం కాస్త ముందుగానే స్పందించింది. మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.