విద్యార్థులు తినే ఐస్ క్రీమ్ లో డ్రగ్స్.. మంత్రి సంచలనం

Update: 2020-09-09 07:30 GMT
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురికి ఇందులో సంబంధాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాదు.. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయటం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరగటం.. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు ఉండటంతో ఈ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది.

మాదక ద్రవ్యాల్ని రవాణా చేస్తున్న ఆరోపణలపై కన్నడ నటి రాగిణి ద్వివేది అరెస్టు కావటం పలువురిని విస్మయానికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వేళ్లూరుకుంటున్న డ్రగ్స్ వ్యాపారంపై యడ్డీ సర్కారు సీరియస్ గా ఉంది. దీని అంతు చూడాలన్నట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి యడ్డీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హోంమంత్రితో పాటు.. పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యేకంగా టీముల్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యాపారంపైనిఘా పెంచాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. కర్ణాటక మంత్రి సురేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు మహానగరంలోని పలు డ్రగ్స్ ముఠాలు పాఠశాలల వద్ద ఐస్ క్రీముల్లో మత్తుమందు కలిపి విద్యార్థుల్ని టార్గెట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న సంపన్న పిల్లల్ని లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దీంతో.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెన సంచలనంగా మారాయి.
Tags:    

Similar News