ముంచెత్తిన ఇసుక తుఫాన్.. చైనా విలవిల..!
గతంలో ఎన్నడూ లేనివిధంగా చైనా రాజధాని బీజింగ్ లో ఇసుక తుఫాన్ చెలరేగింది. దీంతో బీజింగ్ నగరంలోని భవనాలు, రోడ్లు మొత్తం మసకబారిపోయాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో చైనా ప్రభుత్వం అలర్టయ్యింది. వెంటనే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సహాయక చర్యలు మొదలుపెట్టింది. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచనలు చేసింది.
ఇటువంటి ఇసుక తుఫానును ఈ పదేళ్లలో ఎప్పుడూ చూడలేదని పర్యావరణ శాస్త్రవేత్తలే అటువంటున్నారు. ఒక్కసారిగా రేగిన ఈ ఇసుక తుఫానుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రస్తుతం ఇందుకు సబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇసుక తుఫాను దాటికి బీజింగ్ నగరంలోని ఒక్క భవనం కూడా స్పష్టంగా కనిపించడం లేదు. మొత్తం మసక మసకగా మారిపోయింది. బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇసుక తుఫాన్ రేగడానికి కారణం ఏమిటంటే..!
చైనాకి పశ్చిమ, ఉత్తరంవైపు మంగోలియాలో గోబి అనే ఎడారి ఉంటుంది. అది చాలా పెద్దది. గత పదేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్ అని అధికారులు తేల్చారు. దీని ప్రభావం కొన్ని రోజులపాటూ ఉంటుందని చెబుతున్నారు. గోబీ ఎడారి నుంచే ఈ తుఫాన్ వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.మరోవైపు తుఫానుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట రోడ్ల మీద ఉన్న ప్రజల కళ్లలోకి ఒక్కసారిగా ఇసుక దుమ్ము రావడంతో వాళ్లకు ఏమీ కనిపించక ఇక్కడ్లు ఎదుర్కొన్నారు.
సాధారణంగా శీతల ప్రదేశాల్లో ఇసుక తుఫానులు వస్తుంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటువంటి చైనాలో ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రపంచలోనే కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఒకటి. అటువంటి దేశంలో ఇసుక తుఫాన్ చెలరేగింది. అయితే ఈ ఇసుక తుఫాన్ తో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.