కూతురిని బొందపెట్టిన అత్తా, ఆమె కూతురును లేపేశారు

Update: 2021-08-07 05:30 GMT
అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురును అత్తారింట్లో అదనపు కట్నం వేధింపులతో అత్తా, ఆమె కూతురు హతమార్చారు. అంతేకాదు.. అతి దారుణంగా ఇంట్లోనే బొందపెట్టారు. ఇది చూసి ఆ అమ్మాయి కుటుంబం తీవ్రంగా కృంగిపోయింది. ఆ అత్త, ఆమె కూతురుపై ప్రతీకారంతో రగిలిపోయింది.చివరకు వారిని ఊరినడిబొడ్డుకు రప్పించి మరీ అడ్డంగా నరికేశారు.

తమ కూతురిని చంపి ఇంట్లోనే సమాధి చేశారని ఆ కుటుంబం ప్రతీకారం తీర్చుకుంది. తల్లికూతురిని చంపేసి వారి పగ చల్లార్చుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని డి.నేలటూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

డి.నేలటూరు గ్రామానికి చెందిన అంజనమ్మ కొడుకుతో షరిష్మాను ఇచ్చి పెళ్లి చేశారు. అయితే 2019లో వరకట్న వేధింపుల్లో భాగంగా షరిష్మా అత్తింటి వారి చేతిలో హత్యకు గురైంది. షరిష్మాను చంపి ఆ ఇంట్లోనే సమాధి చేశారు అత్త అంజనమ్మ, ఆమె కూతురు లక్ష్మీదేవి. కోడలి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన అత్త అంజనమ్మ, ఆమె కూతురు లక్ష్మీదేవి నిందితులని తేల్చి జైలుకు పంపారు. ఇటీవలే వారు బెయిల్ పై బయటకు వచ్చారు. సొంతూరు వెళితే ప్రాణాపాయం అని తెలిసి బ్రహ్మంగారి మఠంలో తలదాచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ హత్యకు సంబంధించి పంచాయతీ పెట్టుకొని సామరస్యంగా చేసుకుందామనుకున్నారు. పంచాయతీ పెట్టగా దీనికోసం తల్లీకూతురు నేలటూరుకు వచ్చారు. వారు వచ్చిన విషయం తెలిసిన షరీష్మా కుటుంబ సభ్యులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం అని భావించారు.

గ్రామానికి రాగానే అంజనమ్మ, లక్ష్మీదేవిలను నరికి చంపారు. సంఘటన స్థలానికి మైదుకూరు డీఎస్పీ చేసుకొని విచారించారు. పాతకక్షలే కారణమని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తల్లీకూతుళ్ల హత్య కడప జిల్లాలో సంచలనం సృష్టించింది.




Tags:    

Similar News