తన స్ఫూఫ్ బాహుబలిని షేర్ చేసి ట్రంప్ ఏమన్నాడంటే?
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అధినేత.. పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్. ఎక్కడ చూసినా ఇదే వార్త. శక్తివంతమైన దేశాధినేత ఇండియాకు వస్తుండడంతో భారత్ పై ఇప్పుడు అంతర్జాతీయ, జాతీయ మీడియా సహా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు.. అతడి మేనియాను మరింత పెంచేందుకు పలువురు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా భారత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి సినిమాలోని ‘సాహోరే బాహుబలి’పాటలో ప్రభాస్ ను డొనాల్డ్ ట్రంప్ గా చిత్రీకరించి చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. చివరకు ఈ వైరల్ వీడియో అమెరికా అధ్యక్షుడి కంట్లో పడింది.
ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ సినిమాను మెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా బాహుబలిగా ట్రంప్ ను చిత్రీకరిస్తూ చేసిన వీడియోను ట్రంప్ స్వయంగా షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన ట్రంప్ తెగ ముచ్చట పడ్డట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘భారత దేశంలో ఉన్న నా స్నేహితులను కలుసుకునేందుకు నేను ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ ట్వీట్ చేశారు. మొత్తానికి బాహుబలి మేనియా ట్రంప్ పర్యటనలో స్ఫూఫ్ గా మారింది ఏకంగా ట్రంప్ షేర్ చేసే వరకూ ఆ వీడియో వెళ్లడం అందరినీ ఆకర్షించింది.
వీడియో కోసం క్లిక్ చేయండి