ఉత్తరకొరియాపై ఆంక్షలు..అమెరికా యూటర్న్

Update: 2018-06-23 09:20 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో అంతుబట్టడం లేదు. ఈ మధ్య మెక్సికో దేశం నుంచి అమెరికాలోకి వచ్చిన కుటుంబాల్లో తల్లి - పిల్లలను వేరు చేసి దుమారం రేపాడు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు.

తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడితో సింగపూర్ లో భేటి అయ్య ట్రంప్ చేసొన చర్చలు ఫలవంతం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఇక తాను అణు పరీక్షలు చేయనని.. పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ట్రంప్ ఉత్తర కొరియాకు షాక్ ఇచ్చారు. కిమ్ జాంగ్ అణు పరీక్షలు జరుపను అని హామీ ఇచ్చినా కూడా ఆ దేశంపై మరో ఏడాదిపాటు ఆంక్షలు కొనసాగుతాయని  సంచలన ప్రకటన చేశారు.

ఉత్తరకొరియాను అణ్వస్తరహిత దేశంగా మార్చడంలో ట్రంప్ చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతుండగా.. తాజాగా ఆయన యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరకొరియాపై ఆంక్షలను కొనసాగిస్తూ ఆయన అమెరికన్ కాంగ్రెస్ కు లేఖ రాయడం దుమారం రేపింది.

అణ్వస్త్రాల వినియోగంపై కిమ్ స్పష్టమైన ప్రకటన చేసినా వారిని పూర్తిగా నమ్మలేమని  ట్రంప్  ఆ లేఖలో పేర్కొనడం విశేషం. భవిష్యత్ గురించి ఆలోచించే ఉత్తరకొరియాపై మరో ఏడాదిపాటు ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.  ప్రస్తుతం ట్రంప్ ఇచ్చిన షాక్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్  ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News