అమెరికా లవ్స్ ఇండియా.. ట్రంప్ ట్వీట్ వైరల్

Update: 2020-07-05 10:00 GMT
అగ్రరాజ్యపు అధినేత మరోసారి భారత్ పై ప్రేమను చాటుకున్నాడు. భారత ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ కు అద్భుతంగా స్పందించాడు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై అభిమానాన్ని చాటుకున్నాడు. ‘అమెరికా లవ్స్ ఇండియా’ అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ సందేశాన్ని పంపారు.

దీనికి స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్.. అమెరికా లవ్స్ ఇండియా’ అని పేర్కొంటూ మోడీ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ఇలా భారత్ పై మరోసారి తన అభిమానాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా చాటుకున్నారు.

భారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సైనికపరంగా కూడా భారత్ కు అండగా ఉంటామంటూ ఇదివరకు అమెరికా ప్రకటించడం విశేషం.


Tags:    

Similar News