ముకేశ్ అంబానీ కి ఉత్సాహం ఇచ్చేవి ఏంటో తెలుసా?
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో అనే సామెత మనందరికీ తెలిసిందే. నిజానికి ఒక పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. పుస్తక పఠనంతో అన్ని రకాల అనుభూతులను పొందవచ్చు. అందుకే ప్రముఖులు సైతం నిత్యం పుస్తక పఠనం చేస్తుంటారు. వాళ్ల సక్సెస్ స్టోరీ లో పుస్తకాలు కూడా ఒకింత భాగస్వామ్యం అవుతాయంటే అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ స్టోరీ. కరోనా మహమ్మారి కాలంలో తనలో జోష్ నింపడానికి ఓ ఐదు పుస్తకాలు సహకరించాయని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇంతకీ ఆ స్పెషల్ బుక్స్ ఏంటో తెలుసుకుందామా?
కరోనా మహమ్మారి సమయంలో తనలో ఉత్సాహాన్ని నింపడానికి టెన్ లెస్సన్స్ ఫర్ ఏ పోస్ట్ ప్యాండమిక్ వరల్డ్ పుస్తకం బాగా ఉపయోగపడిందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇండో అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా ఈ గొప్ప పుస్తకాన్ని రచించినట్లు ఆయన చెప్పారు. ఇటీవల కోరలు చాచిన మహమ్మారి, ప్రపంచంలో చోటు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి ఇందులో వివరించారు. జీవన విధానాలు, పాలక నిర్మాణం సరిగా లేని సమయంలో వివిధ సంక్షోభాలు వస్తాయని ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకులు, మంచి పాలన, ఆరోగ్యకరమైన జీవన విధానాల వల్ల ఆ సంక్షోభాలను ఎదుర్కొగలగవచ్చని వివరించారు. అయితే ఈ బుక్ లో నచ్చిన ఒక లైన్ ను రిలయన్స్ అధినేత అందరితో పంచుకున్నారు. వ్యాప్తి అనివార్యం.. మహమ్మారి ఐచ్ఛికం అనే లైన్ తనకు బాగా నచ్చిందని ఈ పుస్తక సమీక్ష లో భాగంగా ఆయన పేర్కొన్నారు.
రిలయన్స్ అధినేతను ఆకట్టుకున్న మరో బుక్... ప్రిన్సిపుల్ల్ ఫర్ లీడింగ్ విత్ ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్.. వై సక్సీడ్ నేషన్స్ అండ్ ఫెయిల్యూర్. అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ రే దాలియో దీనిని రచించారు. ఇందులో ప్రధానంగా వివిధ దేశాల చరిత్రను వివరించారు. 500 ఏళ్ల నుంచి ప్రధాన దేశాల స్థితిగతులను ప్రస్తావించారు. అన్ని కోణాల్లోనూ వివరించిన ఈ పుస్తకం చాలా ఆసక్తిగా సాగుతుందట. గతం, వర్తమాన, భవిష్యత్ ను కచ్చితంగా విశ్లేషించిన ఈ పుస్తకాన్ని యువత, పారిశ్రామిక వేత్తలు, కార్యనిర్వాహకులు వంటి వారు ఇది చదివాలని ముకేశ్ సూచించారు.
ముకేశ్ అంబానీని అమితంగా ఆకట్టుకున్న మరో పుస్తకం ది ర్యాగింగ్ 2020.. కంపెనీస్, కంట్రీస్, పీపుల్ అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఆధునిక నాగరికతపై ఈ పుస్తకాన్ని అమెరికన్ రచయిత అలెక్ రాస్ రచించారు. వివిధ దేశాల ఒప్పందాలు, వ్యాపారాలు వంటివి డిజిటల్ యుగానికి ఎలా సహకరించాయో ఇందులో వివరించారు. ఇందులో రాజకీయ-ఆర్థిక శక్తులకు సంబంధించిన విషయాలను కూలంకషంగా వివరించారు. అంతేకాకుండా ఆర్థిక సవాళ్లు, నాగరికత ముందున అంశాల వంటి వాటిపై నిపుణుల అభిప్రాయాలతో కూడిన ఇంటర్వ్యూలను ఇందులో ప్రచురించారు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని రిలయన్స్ అధినేత అభిప్రాయపడ్డారు.
స్పానిష్ సోషియాలసిస్ట్ మౌరో గుయిల్లిన్ రచించిన 2030.. హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విలి కొలిడే అండ్ రీషేవ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ పుస్తకం కూడా తనను ఆకట్టుకున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందులో ప్రపంచ స్థితిగతులు, జనాభా పెరుగుదల, జీవన శైలి, ప్రపంచ ఆర్థిక అంశాలు, పట్టణీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ వంటి వాటిని వివరించారు.
రిలయన్స్ అధినేతలో ఉత్సాహం నింపిన మరో పుస్తకం బిగ్ లిటిల్ బ్రేక్ త్రోన్.. హౌ స్మాల్ ఎవ్రీడే ఇన్నోవేషన్స్ డ్రైవ్ ఓవర్ సైజ్డ్ రిజల్ట్స్. అమెరికన్ ఎంట్రెప్రెన్యూర్ జోష్ లింక్నర్ దీనిని రచించారు. వ్యాపారుల కోసం ఇందులో కొన్ని ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. బిజినెస్ లో లాభాలు, క్రియేటివిటీ వంటి సూత్రాలు ఇందులో ప్రధానమైనవి. వీటి ద్వారా వ్యక్తులు, వ్యవస్థలు కఠినమైన పరిస్థితులను సైతం సులభంగా ఎదుర్కొగలగవచ్చు అని ముకేశ్ అభిప్రాయపడ్డారు.
పైన చెప్పిన ఐదు పుస్తకాలు కూడా ఆర్థిక అంశాలు, వ్యాపారం, ప్రపంచ స్థితిగతులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇందులో కొన్ని యువత చదవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.