దేశంలో ముఖ్య‌మంత్రుల వేత‌నాలు ఎంతో తెలుసా..? అత్య‌ధికం.. అత్య‌ల్పం తెలుగు రాష్ట్రాల్లోనే!

Update: 2021-03-06 23:30 GMT
వేత‌నం అనేది ప్ర‌తిభ‌కు క‌ట్టిన ప‌ట్టంగా భావిస్తుంటారు చాలా మంది. అయితే.. సాధార‌ణ ఉద్యోగాల విష‌యంలో ఇది వాస్త‌వం కావొచ్చు. కానీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌రికి దీనికి అర్థం మారిపోతుంది. ఎందుకంటే.. వారు ప్ర‌జాసేవ చేస్తామంటూ రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. కాబ‌ట్టి.. వారి అవ‌స‌రాలు మొత్తం ప్ర‌జాధ‌నం నుంచే ఖ‌ర్చు చేస్తారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు ముఖ్య‌మంత్రులు భారీగా వేత‌నాలు పొందుతున్నారు. రాష్ట్ర ప‌రిస్థితుల దృష్ట్యా మ‌రికొంద‌రు అత్య‌ల్పంగా జీతాలు తీసుకుంటున్నారు.

అయితే.. ఫోను బిల్లు మొద‌లు, పెట్రోలు ఖ‌ర్చులు, ఇంటి మెయింటెనెన్స్ అంటూ ఇత‌ర‌త్రా అల‌వెన్సులు చాలానే ఉంటాయి. ఇవ‌న్నీ వ‌చ్చే జీతంతో సంబంధం లేకుండా అద‌నంగా వ‌స్తాయి. మ‌రి, దేశంలో అత్య‌ధిక జీతం పొందుతున్న ముఖ్య‌మంత్రి ఎవ‌రు? అత్య‌ల్ప వేత‌నం తీసుకుంటున్న‌ది ఎవ‌ర‌న్న‌ది చూద్దామా..?

దేశంలోనే అధిక జీతం పొందుతున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌న‌కు నెల‌కు రూ.4.10 ల‌క్ష‌ల వేత‌నం ల‌భిస్తోంది. ఈ వేత‌నంతోపాటు హౌస్ మెయింటెనెన్స్ అల‌వెన్స్‌, టెలిఫోన్ బిల్లు, పెట్రోలు ఖ‌ర్చులు, అంత‌ర్రాష్ట్ర ప్ర‌యాణ ఖ‌ర్చులు వ‌గైరా అద‌నంగా అందుతాయి.

రెండో స్థానంలో ఉన్నారు ఢీల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఆయ‌న నెల‌కు రూ.4 ల‌క్ష‌ల వేత‌నం పొందుతున్నారు. ఇత‌న అలవెన్సులు కూడా అద‌నంగా ఉంటాయి.

మూడో స్థానంలో ఉన్నారు యూపీ ముఖ్య‌మంత్రి యోడీ ఆదిత్య‌నాథ్‌. ఆయ‌న‌కు నెల‌కు రూ.3 ల‌క్ష‌ల 65 వేల వేత‌నం ల‌భిస్తోంది. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేకు నెలకు రూ.3 ల‌క్ష‌ల 40 వేల వేత‌నం అందుతోంది. ఈయ‌న‌కు కూడా ఇత‌ర అల‌వెన్సులు అద‌నంగా ల‌భిస్తాయి.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ నెల‌కు రూ.3 ల‌క్ష‌ల 21 వేలు పొందుతున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

హిమాచ‌ల్ సీఎం జైరామ్ ఠాకూర్ నెల‌కు రూ.3 ల‌క్ష‌ల 10 వేలు పొందుతున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నంగా ల‌భిస్తాయి.

హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర‌ల్ లాల్ ఖ‌ట్ట‌ర్ నెల‌కు రూ.2 ల‌క్ష‌ల 88 వేల వేత‌నం పొందుతున్నారు. సీఎం హోదాలో ఇత‌ర అల‌వెన్సులు ల‌భిస్తాయి.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నెల‌కు రూ.2 ల‌క్ష‌ల 72 వేలు పొందుతున్నారు. ఇత‌ర అల‌వెన్సులు కూడా వ‌స్తాయి.
4

మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వేత‌నంగా రూ.2 ల‌క్ష‌ల 55వేలు తీసుకుంటున్నారు. అల‌వెన్సులు అద‌నం.

బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ నెలకు రూ.2 ల‌క్ష‌ల 15 వేలు వేత‌నంగా పొందుతున్నారు. అల‌వెన్సులు అద‌నం.

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నెల‌కు రూ.2 ల‌క్ష‌ల 10 వేల వేత‌నం పొందుతున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి నెల‌కు రూ.2ల‌క్ష‌ల 5వేలు పొందుతున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నంగా ఉంటాయి.

క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప నెల‌కు రూ.2 ల‌క్ష‌లు వేత‌నంగా తీసుకుంటున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ నెల‌కు రూ.1 ల‌క్షా 85 వేలు జీతంగా తీసుకుంటున్నారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు రాష్ట్ర‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.3 ల‌క్ష‌ల 35వేల వేత‌నం ల‌భిస్తుంది. కానీ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్న కార‌ణంగా నెల‌కు కేవ‌లం రూపాయి మాత్ర‌మే వేత‌నంగా తీసుకుంటాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అందువ‌ల్ల ఇప్పుడు అత్య‌ల్పంగా జీతం పొందుతున్న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ చివ‌రి స్థానంలో ఉన్నారు.
Tags:    

Similar News