రోజూ తేనె వాడే అలవాటుందా? ఇది వెంటనే చదవండి

Update: 2020-12-03 23:30 GMT
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తేనె వాడకటం బాగా పెరిగింది. పొద్దుపొద్దున్నే వేడి నీళ్లలో చెంచాడుతేనె.. నిమ్మకాయతో కలిపిన నీళ్లను తీసుకోవటం..ఆ రోజుకు ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లుగా ఫీల్ అయ్యే వారు బోలెడంతమంది. అయితే.. ఈ తేనెలో స్వచ్ఛత ఎంత? అన్నది పెద్ద ప్రశ్న. ఇదే విషయాన్ని లెక్క తేల్చేందుకు కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన శాస్త్రీయ.. పర్యావరణ సంస్థ (సీఎస్ఈ) రంగంలోకి దిగింది. ఈ సంస్థకు చెందిన చీఫ్ సునీత నరైన్ మార్కెట్ లో లభించిన 13 ప్రముఖ బ్రాండ్ల తేనెలను పరీక్షలకు పంపారు.

దేశీయంగా జరిపిన పరీక్షల్లో అన్ని ప్రముఖ బ్రాండ్లు పాస్ అయ్యాయి. కొన్నిచిన్న బ్రాండ్లు ఫెయిల్ అయ్యాయి. అనంతరం..ఈ శాంపిళ్లను జర్మనీకి పంపారు. అక్కడ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్రిసోనెన్స్ పరీక్షల కోసం పంపారు. ఈ పరీక్ష ప్రత్యేకత ఏమిటంటే.. తేనెలో గుట్టుగా దాగి ఉన్న చెక్కర అనవాళ్లను ఇట్టే పట్టేస్తుంది. ఈ కల్తీ నివారణ టెస్టుల్లో బయటకు వచ్చిన కఠోర సత్యమేమంటే.. తేనెలో కల్తీని పరీక్షల్లో గుర్తించలేని రీతిలో చైనాకు చెందిన ఫ్రక్టోస్ ద్రావణాన్ని కలుపుతున్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ద్రావణంచైనా నుంచి భారత్ కు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు.

మొత్తం 13 ప్రముఖ బ్రాండ్లలో పది బ్రాండ్లు పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. తేనెలో 50 నుంచి 80 శాతం వరకు చక్కెర పాకంతో కల్తీ చేసినా.. అన్ని పరీక్షల్ని దాటేసేలా ఈ ద్రావణం సాయం చేస్తుందని చెబుతున్నారు. సీఎస్ఈ రిపోర్టు ఇప్పుడు సంచలనంగా మారింది. తేనెలోని ఘరానా కల్తీని బయటపెట్టిన వైనం షాకింగ్ గా మారింది.

సీఎస్ఈ చేసిన టెస్టుల్లో ఫెయిల్ అయిన ప్రముఖ కంపెనీల్లో.. డాబర్.. బైద్యనాథ్.. పతంజలి.. ఇమామి జండూ.. హిత్కారి.. అపిస్.. హిట్కరి.. హిమాలయ కంపెనీలు ఉన్నట్లుగా తేల్చారు. ఇక.. ఈ పరీక్షలో పాస్ అయిన మూడు బ్రాండ్ల విషయానికి వస్తే.. సఫోలో.. మార్కె ఫెడ్ సోనా.. సోసొయేట్ నేచురల్లీవి మాత్రమే కల్తీ ఉత్పత్తులు కావని తేల్చారు. ఈ వ్యవహారంపై ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగి.. తాము ఎలాంటి కల్తీకి పాల్పడటం లేదని.. తమ ఉత్పత్తులన్ని నాణ్యమైనవిగా పేర్కొన్నాయి. తమ బ్రాండ్ పేరును దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరి.. ఈ వ్యవహరంలోకి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేస్తే ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News