పిల్లలకు స్మార్ట్​ ఫోన్లు ఇవ్వకండి.. పిచ్చేక్కే ప్రమాదం ఉంది

Update: 2020-10-25 23:30 GMT
ఈ మధ్యకాలంలో పిల్లల్లోనూ స్మార్టఫోన్ల వాడకం పెరిగిపోయింది. రెండేళ్ల పిల్లలు, మూడేళ్ల  పిల్లలు స్మార్ట్​ ఫోన్లతో టైంపాస్​ చేస్తున్నారు. తల్లిదండ్రులే మొదట పిల్లలకు  వీటిని అలవాటు చేస్తున్నారు. అయితే స్మార్ట్​ ఫోన్ల వాడకం పిల్లల మెదడు, జ్ఞాపకశక్తిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని.. రానూ రానూ.. వారికి మానసిక సమస్యలు పెరగొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను మొదట్లోనే స్మార్ట్​ ఫోన్లకు దూరంగా ఉంచాలి. వారికి బాగా అలవాటయ్యాక.. స్మార్ట్​ ఫోన్లను మాన్పించడం చాలా కష్టం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.


పిల్లలకు ఎనిమిదేళ్ల వరకూ అసలు ఫోన్ ఇవ్వొద్దని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ 16 ఏళ్ల  లోపు ఫోన్ ఇచ్చినా పేరెంట్స్ పక్కనే ఉండాలని సూచిస్తున్నారు. స్మార్ట్​ ఫోన్లకు అడిక్ట్​ అయితే పిల్లలో క్రియేటివిటీ తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. గంటల కొద్ది మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చూడడం, గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడడం వల్ల పిల్లల బ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కళ్లు, మెడ నరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మానసిక రోగాలు వస్తున్నాయి.

పిల్లల చేతిలో నుంచి మొబైల్ తీసుకుంటే చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో కలవలేక ఆత్మన్యూనతకు లోనవడంతోపాటు తమలో తామే మాట్లాడుకుంటూ మానసిక రోగాలకు గురవుతున్నారు. నిద్రలేమి, మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని గోడకు తల బాదుకోవడం, బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నుంచి దూకుతానని బెదిరించడం తాను చాలా కేసుల్లో చూశానని సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషి తెలిపారు. మొబైల్ అడిక్ట్ అవుతున్న పిల్లల్లో బెదిరించడం, తమను తామే గాయపర్చుకోవడం, ఏంచేస్తున్నామో తెలియకుండా వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.
Tags:    

Similar News