• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా ఎఫెక్ట్ :విడాకుల...

కరోనా ఎఫెక్ట్ :విడాకుల కోసం కొత్త జంటల పాట్లు..ఎందుకంటే?

By - Tupaki Desk
Update: 2020-03-16 23:30 GMT
కరోనా ..కరోనా ..కరోనా ...అదేదో కరీనా అనుకుంటే పొరపాటే. కరీనా కపూర్ కాదు ..కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ని తలచుకున్నని సార్లు - ఎదో ఒక దేవున్ని తలచుకున్నా ఈపాటికి కోరుకున్న వరం ఎదో ఇచ్చేవాడు. కానీ , ఈ కరోనా మాత్రం - తగ్గిపోవడం పక్కన పెడితే - ఇంకా వేగంగా విస్తరిస్తుంది. చైనాలోని వూహన్ సిటీలో బయటపడ్డ ఈ కరోనా వైరస్ ..ఆ తరువాత అక్కడి నుండి ఒక్కో దేశానికీ విస్తరిస్తూ  - దాదాపుగా ప్రపంచంలోని 140 దేశాలకి విస్తరించింది. ఇక ఆ కరోనా భారత్ లోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు ..110 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఇక, ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచ దేశాలు  - తమ తమ దేశాలలో అన్ని రంగాలకి సెలవులు ప్రకటించింది. ఇదే ఇప్పుడు కొత్తగా  పెళ్ళైన జంటలకు శాపంగా మారింది. అసలు కరోనా వల్ల కొత్త జంటలకు ఏంటి సమస్య అని ,అసలు  కరోనా వైరస్‌‌ కు - వాళ్లకు లింకేంటి అని అనుకుంటున్నారా.? అసలు విషయం ఏంటంటే ...తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చూసుకుంటే చైనాలో ఒకే ఆఫీసులో పని చేస్తున్న 300 జంటలు విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అన్ని దేశాలు  స్కూళ్లు - విద్యాసంస్థలు - ఆఫీసులు అన్నింటినీ బంద్ చేసి జనాలను గృహ నిర్బంధం చేశారు. దీనితో కొత్తగా పెళ్ళైన జంటలు ఇళ్ల దగ్గర ఎక్కువగా సమయం గడుపుతున్నారు. దీనితో వారు తరచూ గొడవలకు దిగుతున్నారు.

ఈ క్రమంలోనే వందలాది జంటలు తమ బంధానికి ఫుల్‌ స్టాప్ చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది అపాయింట్‌ మెంట్లను సైతం తీసుకున్నట్లు డజహౌకు చెందిన మ్యారేజ్ రెజిస్టరీ మేనేజర్ లూ షిజున్ స్పష్టం చేశాడు. యువ జంటలు ఎక్కువసేపు ఇళ్ల దగ్గర గడుపుతున్న నేపథ్యంలో ఇద్దరి  మధ్య గొడవలు జరగడం - పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్  జరగడం వల్ల - వాళ్ల వ్యవహారం విడాకుల వరకు వెళ్తోందని ఆయన అన్నారు. అయితే , విడాకుల కేసులు ఎక్కువ కావడానికి మరో కారణం కూడా ఉందని అయన అభిప్రాయపడుతున్నారు. కరోనా భయంతో  సంస్థలు కొద్దిరోజులుగా మూసేసి ఉండటంతో అప్లికేషన్స్ వెల్లువ పెరిగి ఉండవచ్చునని లూ షిజున్ అభిప్రాయపడుతున్నారు. ఒక్క డజహౌ నగరంలోనే కాదు.. చైనాలోని పలు  సిటీస్‌ లో విడాకుల కేసులు ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది.
Tags:    
  • Divorce Cases 
  • China 
  • CoronaVirus 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS