• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అసెంబ్లీలో అన్నీ అవస్థలే

అసెంబ్లీలో అన్నీ అవస్థలే

By - Tupaki Desk
Update: 2017-03-08 05:18 GMT
అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీలో  ప్రారంభమైన రెండోరోజునే వైఫల్యాలు వెలుగుచూశాయి. విధులకు హాజరయ్యేవారు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.  మండే ఎండలో కనీసం మంచినీళ్ళు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.  అసెంబ్లీలో తాగేందుకు చుక్కు నీరు లేకపోగా.. కనీసం బాత్‌రూముల్లో సైతం నీరు రావడం లేదు.  దీంతో సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.
    
మరవైపు  అసెంబ్లీ వద్ద బందోబస్తు సిబ్బంది నానా హంగామా చేస్తున్నారు. జర్నలిస్టులకు అసెంబ్లీ కార్యదర్శి సంతకంతో జారీ చేసిన పాస్‌ లు చూపించినప్పటికీ వదలని పోలీసులు మీ గుర్తింపు కార్డులు చూపాలంటూ పట్టుబడుతున్నారు. ఐదు అంచెల పోలీసు తనిఖీలు దాటందే అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లలేని పరిస్ధితి.
    
ఇక మీడియా పాయింట్ వద్ద పరిస్థితి దుర్భరం. సమీపంలోని పోలీసులు ప్రతి జర్నలిస్టు పేరు - సంస్థ - ఫోన్ నెంబర్ చెప్పాలంటూ నమోదు చేసుకుంటున్నారు. పోలీసుల తీరుపై పలువురు మీడియా ప్రతినిధులు మండిపడటంతో మాకెందుకు సార్ మా బాస్ చెప్పారు. మేం ఉద్యోగం చేయాలి కాబట్టి తప్పదు అంటూ పలువురు భద్రతా సిబ్బంది వాపోతున్నారు. ఇక మండే ఎండలో షెడ్డులాంటి మీడియా పాయింట్ పాయింట్‌ లో విలేఖరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు.  కనీసం గొంతు తడుపుకునేందుకు కూడా చుక్క నీరు అందుబాటులో లేదని చెబుతున్నారు.
    
కొత్త టెక్నాలజీ పేరుతో ఏర్పాటు చేసిన మైక్‌లు సక్రమంగా పని చేయడం లేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే స్పీకర్ కోడెల దృష్టికి తీసుకువచ్చారు.  అసెంబ్లీ గ్యాలరీలో సిట్టింగ్ స్టెప్స్ హైట్ లేకపోవడంతో వెనుక కూర్చున్నవారికి ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. సభలో ప్రశ్నోత్తరాలు జవాబులకు సంబంధించిన సమాచార ప్రతిని ఇవ్వడం లేదని..  మండలి ప్రెస్ గ్యాలరీలో సీట్లు వేసేందుకు చోటు ఉన్నప్పటికీ పరిమితంగా 17సీట్లు మాత్రమే వేయడంతో గంటల తరబడి నిలబడి రాసుకోవాల్సి వస్తోందని జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Andhra New Assembly 
  • Amaravati 
  • Andhra Assembly 
  • Telugu NEWs 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS