ప్రణయ్ హత్యకి మారుతీరావు డబ్బు ఎలా ఇచ్చాడో తెలుసా ..?

Update: 2020-03-11 05:13 GMT
దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకి సంబంధించిన కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ కులం వాన్ని ప్రేమించి , పెళ్లి చేసుకుంది అన్న కోపం తో మారుతీరావు, ఆల్లుడైన ప్రణయ్ ని కిరాయి హంతకుల చేత హత్య చేయించిన విషయం తెలిసిందే. తాజాగా మారుతీరావు కూడా ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇకపోతే నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం ప్రణయ్ హత్య కేసును విచారించింది.

ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన చార్జిషీటుపై ఈ మేరకు కోర్టు దృష్టిసారించింది. కూతురు తక్కువ కులం వాణ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన మారుతిరావు.. తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసిమరీ ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చినట్లు చార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు. ఎన్ని చెప్పినా వినకుండా అమృత , ప్రణయ్ ని పెళ్లి చేసుకొని కుటుంబ పరువు తీసింది అని ,ఆ కోపంతోనే ప్రణయ్‌ని హత్య చేయించడానికి మారుతిరావు సిద్ధమయ్యాడని, కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించడానికి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గరున్న ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టాడని చార్జిషీటులో వెల్లడైంది. హత్య కేసులో ఏ2గా ఉన్న మారుతిరావు సోదరుడు శ్రవణ్ ఈ విషయాలను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 1200 పేజీలతో కూడిన ఛార్జ్ షీటును దాఖలు చేశారు. అందులో 102 మంది సాక్షుల స్టేట్మెంట్లను పొందుపర్చారు. ఛార్జ్‌ షీట్ దాఖలు కావడంతో కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయింది. ఏ1 మారుతిరావు శనివారం హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2 శ్రవన్ మంగళవారం నాటి కోర్టు విచారణకు హాజరు కాలేదు. మిగతా ఆరుగురు నిందితులులను పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. కూతురు కులం తక్కువవాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో తలెత్తుకోలేక పోయానని, పెళ్లి తర్వాత కూడా బంధువులతో రాయబారం పంపినా అమృత దిరిగిరాలేదని, కాబట్టే ప్రణయ్ ని చంపాలనుకున్నానని, హత్య చేయించేందుకు కావాల్సిన డబ్బును శ్రవణ్ ఏర్పాటు చేశాడని మారుతిరావు చెప్పినట్లు స్టేట్మెంట్ లో రికార్డయింది

అయితే, ఈ కేసులో ప్రధాన పాత్ర వహిస్తున్న అమృత.. తన తండ్రికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందే అమృతని తన దారిలోకి తెచ్చుకుని, స్టేట్మెంట్ ను తప్పుడు ప్రయత్నంగా చిత్రీకరించేందుకు మారుతిరావు చేయని ప్రయత్నాలు లేవు. కానీ , అమృత ఎంచెప్పినా కూడా లొంగకపోవడంతో అయన హైదరాబాద్ కి లాయర్ ను కలవడానికి వచ్చి, అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tags:    

Similar News